»   » అది మాతోనే మొదలైంది, పైరసీ గైరసీ జాన్తానై : బాలయ్య

అది మాతోనే మొదలైంది, పైరసీ గైరసీ జాన్తానై : బాలయ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్వరలో ‘డిక్టేటర్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలయ్య పైరసీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పైరసీ అంశంపై హాయన మాట్లాడుతూ... పైరసీలు, గైరసీలు జాన్తానై, అవన్నీ మనకు పడవన్నారు. తమ సినిమాలను టీవీలు, సీడీల్లో చూస్తే పెద్ద మజా రాదని, పెద్ద స్క్రీన్లలో చూస్తేనే తమ సినిమాలు మజానిస్తాయని ఆయన పేర్కొన్నారు.

కొన్ని సందర్భాల్లో స్టేజీలపైనా, సినిమాల్లోను తాను చెప్పే డైలాగుల నుంచి ఓ పాయింట్ పట్టుకుని, తన బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా రచయితలూ కథలు రాస్తారని బాలయ్య చెప్పుకొచ్చారు. తెలుగు సినీ ప్రేక్షకులు నందమూరి సినిమాల్లో డైలాగులనే ఎంజాయ్ చేస్తారని, అందుకే తమ సినిమాల్లో డైలాగులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందన్నారు.


థియేటర్లలో తెర ముందు డాన్సులు, పూజలు, ఈలలు, గోలలు, కాగితాలు విసరడం వంటి సంప్రదాయాలు నందమూరి ఫ్యామిలీ సినిమాలతోనే మొదలైందన్నారు. అది బీసీ సెంటర్లైనా, 70 ఎంఎం థియేటర్లైనా, మల్టీప్లెక్స్ మాల్స్ అయినా సందడి ఉండాల్సిందే అన్నారు. డిఅప్పట్లో తన తండ్రి గారి సినిమాలకు బళ్లు కట్టుకుని మరీ వెళ్లి చూసేవాళ్లని, ఆ తరువాత ఆ సంప్రదాయం తనకు మాత్రమే కొనసాగిందని ఆయన చెప్పాడు.నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం డిక్టేటర్. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.


ఆనంద్ రామరాజు, సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఫైట్స్‌: రవివర్మ, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, రచన: శ్రీధర్‌ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌, నిర్మాత: ఈరోస్‌ ఇంరట్నేషనల్‌, కో ప్రొడ్యూసర్‌, దర్శకత్వం: శ్రీవాస్‌.

English summary
Balakrishna says....No Issues with My Film Piracy. Because his films don't die with piracy as fans will watch him only in theatres.
Please Wait while comments are loading...