»   » మళ్లీ వ్యసనానికి బానిసైన బండ్ల గణేశ్

మళ్లీ వ్యసనానికి బానిసైన బండ్ల గణేశ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఓ వ్యసనం లాంటి వాడు. అతడిని అలవాటు చేసుకొంటే దూరం కావడం చాలా కష్టమని గతంలో ఓ ఆడియో ఆవిష్కరణ వేదికపై బండ్ల గణేశ్ అన్నారు. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి గణేశ్ ఎప్పడూ చేసే వ్యాఖ్యలు మీడియాను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. వీలు చిక్కితే పవర్ స్టార్‌ను దేవుడు అని కీర్తించడం గణేశ్ అలవాటు. రెండేండ్ల గ్యాప్ తర్వాత పవన్‌ను గణేశ్ కలుసుకోవడం చర్చనీయాంశమైంది.

కామెడీ నటుడి నుంచి నిర్మాతగా

కామెడీ నటుడి నుంచి నిర్మాతగా

కామెడీ యాక్టర్‌గా అప్పుడప్పుడు తెరపై కనిపించే బండ్ల గణేశ్‌ను ‘తీన్‌మార్' చిత్రంతో నిర్మాతను చేశాడు పవన్. ఆ చిత్రం అంతగా విజయం సాధించకపోవడంతో వెంటనే గబ్బర్‌సింగ్ చిత్రానికి అవకాశం కల్పించాడు. ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్‌ను సొంతం చేసుకొన్నది.

సక్సెస్‌లు.. పలువురు హీరోలతో విభేదాలు

సక్సెస్‌లు.. పలువురు హీరోలతో విభేదాలు

ఆ తర్వాత బండ్ల గణేశ్ స్టార్ నిర్మాతగా మారాడు. బడా హీరోలతో ఎడాపెడా సినిమాలు నిర్మించాడు. కొన్ని విజయాలును మూటగట్టుకొన్నాడు. మరికొన్ని పరాజయాలను ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా పలువురు హీరోలతో విబేధాలు ఏర్పడ్డాయి. ఉన్నట్టుండి నిర్మాతగా పరిశ్రమ నుంచి కనుమరుగయ్యాడు. కానీ అడపాదడపా ఇంటర్వ్యూల్లో కనిపిస్తూ సెన్సేషనల్ కామెంట్లతో మీడియాలో నానుతున్నాడు.

పవన్‌ కల్యాణ్‌తో గణేశ్‌కు గ్యాప్

పవన్‌ కల్యాణ్‌తో గణేశ్‌కు గ్యాప్

అలాంటి దేవుడికి భక్తుడైన బండ్ల గణేశ్‌కు ఈ మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. గత రెండేండ్లుగా పవన్ కలిసిన దాఖలాలు లేవు. ఈ విషయంపై అనేక రూమర్లు వచ్చాయి. గణేశ్‌ను పవన్ కల్యాణ్ లిస్ట్ నుంచి తొలగించాడనే వార్తలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఇటీవల ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పవన్‌ను, తనకు ఏర్పడ్డ విభేదాలను వివరించారు. చాలా రోజులుగా పవన్, తాను కలుసుకోలేదని త్రివిక్రమ్ చొరవతో మళ్లీ కలుసుకున్నట్లు తెలిపారు.

కాటమరాయుడితో మళ్లీ చిగురించిన దోస్తి..

కాటమరాయుడితో మళ్లీ చిగురించిన దోస్తి..

ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా కాటమరాయుడు షూటింగ్‌లో పవన్‌ను బండ్ల గణేశ్ కలుసుకొన్నారు. తాజాగా కాటమరాయుడుతో ఫొటో దిగి, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని గణేశ్ స్పష్టం చేశాడు. గణేశ్ భుజంపై చేయి వేసి ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

English summary
Producer Bandla Ganesh met Power Star Pawan Kalyan recently at Katamarayudu. Because of differences he was away from Pawan Kalyan since two years. Latest Photo with Pawan goes viral in Social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu