'మిథునం' చిత్రంపై బాపూ ఉత్తరం(లెటర్ కాపీ ఫోటోతో...)

బుచ్చి లక్ష్మిగారు అన్నట్లు, బంగారం హరించుకుపోయి లక్క ముద్దలా మిగిలిపోయిన నాకు- నలుగురు పరిపూర్ణమైన (తెలుగులో ఫెరఫెక్ట్) మనుషులు-శ్రీ రమణ,భరిణి, బాలు,లక్ష్మి రూపొందించిన అద్బుతమైన అసామాన్యమైన,అనుపమానమైన సినిమా కావ్యం మిధునం లో ఒకటే లోటు కనిపించింది. నాతో బాటు రమణగారు చూడలేకపోయారే అని-బాపు
ఈ చిత్రం గురించి తణికెళ్ల భరణి మాట్లాడుతూ.. ఆ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమ. పదహారు ప్రాయమైతే ప్రేమలేఖలు రాసుకొనేవాళ్లు. అప్పుడే పెళ్త్లెన జంటైతే చిన్న స్పర్శతో ప్రేమను వ్యక్తం చేసుకొని ఉండేవాళ్లు. కనీసం ముఫ్పైలో ఉన్నా ముద్దుముచ్చట్లలో మునిగేవాళ్లు. కానీ మొన్నే షష్టిపూర్తయ్యింది. ఆ వయసులో జీవితం అంతా పూర్తయిపోయిందనుకొంటారు.. ఎవరైనా! కానీ వాళ్లకు మాత్రం అప్పుడే మొదలైంది. ఆ ప్రేమని ఎలా వ్యక్తం చేసుకొన్నారో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే. 'ఆరుపదుల వయసులో కూడా నూతన దంపతుల్లా కాలం గడిపే జంట ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నమిది. అచ్చ తెలుగు చిత్రమిది అన్నారు తనికెళ్ల భరణి.
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆనంద్ ముయిదా రావు నిర్మాత. శ్రీకాకుళం జిల్లా వావిలవలస గ్రామంలో సన్నివేశాల్ని తెరకెక్కించారు. 'మిథునం' చిత్రానికి వీణాపాణి స్వరాలు సమకూర్చారు. ఇక గతంలో భరిణి 'సిరా', 'కీ', 'బ్లూ క్రాస్' లాంటి లఘు చిత్రాలు రూపొందించి పురస్కారాలు అందుకొన్నారు. 'మిథునం' పూర్తిస్థాయి చలనచిత్రం. ఈ చిత్రం వృద్ధ జంట చుట్టూ తిరుగుతుంది. వీరి ప్రేమాభిమానాలు ప్రధానాంశంగా జీవన వేదాతం ఇమిడి కథ నడుస్తుంది. ఇదే కథలో గతంలో మళయాళంలో ఓ చిత్రం నిర్మించారు. కానీ అది పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేదు. అయితే భరిణిగారు ఈ కథని ఇప్పటి తరానికి అర్దమయ్యేటట్లుగా స్క్రీన్ ప్లే సమకూర్చుకుని,అందరూ చూసేటట్లుగా రూపొందించారు.


Click it and Unblock the Notifications











