»   » కాజల్‌ ని తిట్టిపోసిన స్టార్ డైరక్టర్

కాజల్‌ ని తిట్టిపోసిన స్టార్ డైరక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై : కాజల్ వివాదం రోజు రోజుకీ బాగా ముదిరిపోతోంది. కాజల్ అగర్వాల్‌కు బలుపెక్కువని ప్రముఖ దర్శకుడు భారతీరాజా వ్యాఖ్యలు చేయటం అంతటా చర్చనీయాంశమైంది. ఈ పంజాబీ గుమ్మను బొమ్మలాట్టం చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది భారతీరాజానే. ఈ చిత్రం తరువాత కాజల్ అగర్వాల్‌కు తమిళం, తెలుగు భాషల్లో పలు అవకాశాలు వచ్చాయి.


ఆమెను ఇకపై తమిళ చిత్రాల్లో ఎంపిక చేయరాదంటూ హిందూ మక్కల్ కట్చి ఒత్తిడి చేస్తోంది. ప్రముఖ దర్శకుడు భారతీరాజా కాజల్ అగర్వాల్ చర్యలను తీవ్రంగా ఖండిం చారు. ఆయన మాట్లాడుతూ నటి కాజల్ అగర్వాల్‌ను తమిళంలో తానే పరిచయం చేశానన్నారు. అందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నానన్నారు. కాజల్‌కు బలుపెక్కువ, ఆమె అలా మాట్లాడడంలో ఆశ్చర్యమేమీ లేదని భారతీరాజా పేర్కొన్నారు.

ఇక ఇవేమీ పట్టించుకోని కాజల్.... 'జిల్లా' అనే సినిమా చిత్రీకరణ కోసం ఇటీవల కాజల్‌ మలేసియా వెళ్లింది. కౌలాలంపూర్‌లో చిత్రీకరణ సాగుతోంది. నలుగురు కూర్చొనే ప్రత్యేకమైన విమానంలో పైలట్‌తోపాటు కూర్చొని... అతని సూచనలతో నడిపే అవకాశాన్ని అందిపుచ్చుకొందని కాజల్‌ సన్నిహితులు తెలిపారు. 'జిల్లా'లో ఆమె విజయ్‌తో కలిసి నటిస్తోంది. ఈ సినిమాకి ఆర్‌.బి.చౌదరి నిర్మాత. తమిళంతోపాటు తెలుగులోనూ దీన్ని విడుదల చేయాలనుకొంటున్నారు. ఎప్పట్నించో విమానం నడపాలనుకొంటుంది. అయితే అది అంత ఆషామాషీ వ్యవహారం కాదని ఆమెకీ తెలుసు. మొత్తానికి విమానం కాక్‌పిట్‌లో పైలట్‌తోపాటు కూర్చొనే అవకాశం దక్కించుకొందీ అందాల భామ.

ఈ మధ్య సూర్యతో మాట్రాన్, కార్తీతో నాన్ మహన్ అల్ల, విజయ్‌కు జంటగా తుపాకీ చిత్రాల్లో నటించి పారితోషికాన్ని పెంచుకున్న ఈ భామకు తెలుగు చిత్రం మగధీర పెద్ద బ్రేక్ నిచ్చింది. తాజాగా బాలీవుడ్‌లోనూ రంగప్రవేశం చేసిన కాజల్ అగర్వాల్ ఇటీవల ఒక భేటిలో తమిళ చిత్ర పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడడం, కోలీవుడ్‌లో పెద్ద కలకలాన్నే సృష్టించింది. తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు గౌరవం లేదు ఇక్కడ హీరోలను దేవుడిలా భావిస్తారు, తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు మర్యాదనిస్తున్నారు అం టూ సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చిన కాజల్ అగర్వాల్‌పై తమిళ దర్శక నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Bharathiraja said he did not want to comment on Kajal, who is arrogant and the word respect did not exist in her dictionary.Kajal was this legendary director’s discovery.
Please Wait while comments are loading...