twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏమిటీ దారుణం: రజనీకాంత్‌పై మీడియా ముందే బూతులు!

    తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన సీనియర్, టాప్ డైరెక్టర్ భారతీరాజా రజనీకాంత్ ను ఉద్దేశించి అత్యంత నీచమైన కామెంట్స్ చేసారు.

    By Bojja Kumar
    |

    చెన్నై: రాజకీయాలంటే బుదరకూపం అని ఊరికే అనలేదు. అది బుదర కూపం అని తెలిసినా ప్రజలకు మంచి చేయాలనే ఒక సదుద్దేశ్యంతో ఇందులోకి ఎంటరవ్వాలని చూస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఆదిలోనే అడ్డుకునే ప్రయత్నం జోరుగా సాగుతోంది.

    రజనీకాంత్ మీద విమర్శలు చేస్తున్నది కూడా తమిళ సినీ రంగానికి చెందిన వ్యక్తులే కావడం గమనార్హం. పక్కరాష్ట్రం(కర్నాటక) నుండి వచ్చి తమిళ సినీ ఇండస్ట్రీని ఇన్నాళ్లు రారాజులా ఏలాడనే అక్కసుతో ఇలా చేస్తున్నారో? లేక మరేదైనా కారణమో? తెలియదు కానీ..... నన్ను ఇంతటి వాడిని చేసిన పరిశ్రమలోనే తనపై ఇన్నాళ్లు ఇంతటి ఈర్ష్య దాగి ఉందని తెలిసి రజనీకాంత్ సైతం జీర్ణించుకోలేక పోతున్నారు.

    రజినీమీద ఓ సీనియర్ డైరెక్టర్ విమర్శలు చేసారు. అవి విమర్శలు అనడం కంటే బూతులు అనడమే సబబేమో?

    భారతీరాజా నీచంగా

    భారతీరాజా నీచంగా

    తాజాగా ఆ కామెంట్స్ ఎంత నీచంగా ఉన్నాయంటే.... బహుషా ఇండియాలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి కామెంట్స్ చేసి ఉండరు.

    విమర్శలు కావు... బూతులు

    విమర్శలు కావు... బూతులు

    ‘‘తమిళులకు మంచి నేతలు లేరని వారంటున్నారు. తద్వారా వారొచ్చి మమ్మల్ని ఏలాలని చూస్తున్నారు. సరే.. మా తమిళులకు మంచి నేతలే లేరనుకుందాం. మరి, మీరొచ్చి ఏం చేస్తారు..? నా భార్య గర్భవతి కాలేదని చెప్పి నా బిడ్డకు తండ్రి అవ్వడానికి నువ్వెవరు? ఏ విషయంలోనైనా భాగం అడగొచ్చు. కానీ, నా పడకలోనూ భాగం కావాలని డిమాండ్ చేస్తే ఎలా ఇస్తాను?'' అంటూ నీచమైన కామెంట్ చేశారు భారతీరాజా.

    రాజకీయ పార్టీలే ఈ కామెంట్స్ చేయిస్తున్నాయా?

    రాజకీయ పార్టీలే ఈ కామెంట్స్ చేయిస్తున్నాయా?

    ఒకరకంగా చెప్పాలంటే తమిళనాడులో రాజకీయాలు ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకంటే కాస్త భిన్నంగానే ఉంటాయి. సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే వెంటనే సీయం కావడం ఖాయం అనే భయంలో ఉన్న రాజకీయ పార్టీలు కావాలనే.... సినీ పరిశ్రమకు చెందిన వారితోనే ఇలాంటి కామెంట్స్ చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    కమల్ హాసన్ తో సహా చాలా మంది

    కమల్ హాసన్ తో సహా చాలా మంది

    కమల్ హాసన్ తో సహా చాలా మంది స్టార్స్ రజనీకాంత్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా తమిళనాడులో రాజకీయపక్షాలన్నీ ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.

    English summary
    Tamil director Bharathiraja Sensational Comments On Rajinikanth political entry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X