twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుడిగాడు తర్వాత భీమినేని మరో ప్రయోగం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రీమేక్ చిత్రాల దర్శకునిగా వినుతి కెక్కిన 'భీమనేని శ్రీనివాసరావు' సుడిగాడు చిత్రంతో మరోమారు సంచలన విజయం సాధించిన విషయం విదితమే. ఈ చిత్రం తరువాత ఆయన మరోమారు రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించటానికి సిద్ధమవుతున్నారు.

    ఇటీవల తమిళంలో విజయం సాధించిన 'సుందర పాండ్యన్' రీమేక్ హక్కులను గట్టి పోటీని ఎదుర్కొని తన స్వంతం చేసుకున్నారు 'భీమనేని'. ఈ చిత్రాన్నే తెలుగులో ఆయన స్వీయ దర్శకత్వంలో పునర్నిర్మించనున్నారు. కథ, కథనాలు వైవిధ్యంగా ఉండే ఈ చిత్రాన్ని తమిళంలో దర్శకుడు, కధానాయకుడు కూడా అయిన 'శివ' నటించగా, ఆయన వద్ద దర్శకత్వ శాఖలో సహాయకునిగా పనిచేసిన ఎస్.ఆర్.ప్రభాకర్ 'సుందర పాండ్యన్'ను తెరకెక్కించారు. తెలుగు లో ఈచిత్రంలో నటించే 'కధానాయకుడు, ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలుస్తాయి.

    అల్లరి నరేష్ హీరోగా భీమినేని రూపొందించిన 'సుడిగాడు' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అల్లరి నరేష్ కెరీర్లోనే సినిమా బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. అల్లరి నరేష్ తన సినిమాల్లో అడపా దడపా పెద్ద హీరోలను అనుకరించినా పూర్తి పేరడీ సినిమా చెయ్యలేదు. ఆ లోటుని ఈ చిత్రంతో భర్తీ చేసారు, ఈ చిత్రంలో సుమారు టాలీవుడ్ టాప్ 100 సినిమాల్లోని సన్నివేషాలను తీసుకొని పేరడీ చేసారు. సినిమా టాక్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో కామెడీ డైలాగులు బాగానే పేలినా... కొన్ని చోట్ల మరీ ఓవర్ అయిందనే అభిప్రాయం వ్యక్తం అయింది.

    English summary
    Director Bheemineni Srinivasa Rao, who scored a good hit with ‘Sudigaadu’ recently, has decided to remake Tamil film ‘Sundarapandian’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X