»   » గెలుస్తాననుకోలేదు, అంతా బాల్యమిత్రులయ్యారు: ‘బిగ్ బాస్’ విన్నర్ శివ బాలాజీ

గెలుస్తాననుకోలేదు, అంతా బాల్యమిత్రులయ్యారు: ‘బిగ్ బాస్’ విన్నర్ శివ బాలాజీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

70 రోజుల పాటు తెలుగు టెలివిజన్ రంగంలో సంచలన రేటింగుతో సాగిన 'బిగ్ బాస్' సీజన్ 1 ఆదివారం(సెప్టెంబర్ 24)తో జరిగిన గ్రాండ్ ఫినాలె షోతో తెరపడిన సంగతి తెలిసిందే. మొత్తం 14 మంది పోటీ పడగా అందరినీ వెనక్కి నెట్టి శివ బాలాజీ విజేతగా నిలిచాడు.

ఫైనల్ కు చేరిన ఐదుగురు సభ్యుల్లో విజేతను ఎంపిక చేసే క్రమంలో ప్రేక్షకుల ఓటింగే చాలా కీలకంగా మారింది. మొత్తం 11 కోట్లకు పైగా ఓట్లు వచ్చాయి. అందులో అత్యధికంగా శివ బాలాజీ 3 కోట్ల 34 లక్షల పైచిలుకు ఓట్లతో విజేతగా అవతరించారు.

50 లక్షల ప్రైజ్ మనీ, ట్రోపీ

50 లక్షల ప్రైజ్ మనీ, ట్రోపీ

విజేతగా నిలిచిన శివ బాలాజీకి రూ. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు, బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ ట్రోపీ అందజేశారు. ఉత్కంఠగా సాగిన గ్రాండ్ ఫినాలె షోలో చివరి క్షణంలో శివ బాలాజీని విన్నర్ గా ప్రకటించారు.

Bigg Boss Season 1 Title Winner Siva Balaji wins,takes home Rs 50 lakh | Filmibeat Telugu
నేను గెలుస్తాననుకోలేదు

నేను గెలుస్తాననుకోలేదు

శివబాలాజీ మాట్లాడుతూ, ‘నేను విజేతగా నిలుస్తానని అనుకోలేదు. ఈ షో నుంచి మధ్యలో వెళ్లిపోతానని అనుకున్నాను. ‘బిగ్ బాస్' షో చాలా బాగుందని, ఈ షో విజేతగా తాను నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉందని శివబాలాజీ అన్నారు.

వాళ్ల సపోర్టు వల్లే గెలిచాను

వాళ్ల సపోర్టు వల్లే గెలిచాను

నాతో పాటు బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్స్ అందరూ చాలా బాగా గేమ్ ఆడారు. అందరూ మంచి వ్యక్తులు. వాళ్లు అలా ఉండటం వల్లే నేను ఇంత ప్రశాంతంగా, ఇన్ని రోజులు బిగ్ బాస్ ఇంట్లో ఉండగలిగాను అని శివ బాలాజీ అన్నారు.

నా బాల్యమిత్రుల్లా అయ్యారు

నా బాల్యమిత్రుల్లా అయ్యారు

‘బిగ్ బాస్ లో పాల్గొన్న వారు ఈ షో జరిగే క్రమంలో నాకు చాలా క్లోజ్ అయ్యారు. ఎంత క్లోజ్ గా అంటే నా బాల్య మిత్రులంత దగ్గరయ్యారు. ఆడియన్స్ ఇంత సపోర్ట్ వస్తుందని ఊహించలేదు. నాకు సపోర్టు చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్' అని శివ బాలాజీ వ్యాఖ్యానించారు.

నా భార్య మధుకే చెబుతతా

నా భార్య మధుకే చెబుతతా

ఈ సందర్భంగా ‘లవ్ యూ' అని ఎవరికి చెబుతారు? అని శివబాలాజీని ఎన్టీఆర్ ప్రశ్నించగా, ‘హండ్రెట్ పర్సెంట్ మధుకే' అంటూ శివ బాలాజీ స్పష్టం చేశారు.

ఆదర్శ్ డిసప్పాయింట్మెంట్

ఆదర్శ్ డిసప్పాయింట్మెంట్

అయితే చివరి క్షణం వరకు గెలుస్తాననే హోప్ తో ఉన్న ఆదర్శ్.... తాను విజేత కాదు అని చివరి నిమిషంలో తేలడంతో కాస్త డిసప్పాయింట్ అయ్యారు.

English summary
Actor Siva Balaji won the title of Bigg Boss Telugu season 1. He was declared as the winner of 'Bigg Boss Telugu' on Grande Finale that was telecast on Sunday night. Shiva Balaji, in his acceptance speech, spoke of how most of his fellow contestants have become close friends, as thick as the ones you make in your childhood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu