twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్‌ ఖాన్‌కు హైకోర్టులో రిలీఫ్

    By Srikanya
    |

    ముంబయి: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు బాంబే హైకోర్టులో వూరట లభించింది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ దాఖలైన కేసులో మేజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన తాఖీదుపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సల్మాన్‌ఖాన్‌ తనపై ఉన్న వివిధ కేసులకు సంబంధించి కోర్టులు వెలువరించిన ఆదేశాల వివరాలను సొంత వెబ్‌సైట్‌లో పొందుపరచటాన్ని హేమంత్‌ పాటిల్‌ అనే వ్యక్తి తప్పుపడుతూ బాంద్రా మేజిస్ట్రేట్‌ కోర్టులో ఫిర్యాదు చేశారు. సల్మాన్‌ ఖాన్‌ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ఆరోపించారు. విచారణ చేపట్టిన బాంద్రా మేజిస్ట్రేట్‌ కోర్టు జులై 10న సల్మాన్‌ ఖాన్‌కు నోటీసు జారీ చేసింది. దీనిపై సల్మాన్‌ హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్‌ ఎం.ఎల్‌.తాహిల్యాని సోమవారం నిలుపుదల ఆదేశాలిచ్చారు.

    సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు అనేక కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనపై కోర్టులో యాక్సిడెంట్ కేసు నడుస్తోంది. సెప్టెంబర్ 28, 2002సంవత్సరంలో బాంద్రాలోని ఓ బేకరి ఎదుట నిద్రిస్తున్న జనాలపై సల్మాన్ కారు దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందడంతో పాటు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే అప్పుడప్పుడు సల్మాన్‌పై ఉన్న కేసుల విషయం మీడియాలో తప్పుడు రకంగా ప్రచారం జరుగుతోంది.

    దీంతో పరువు పోతోందని భావించిన సల్మాన్...అభిమానులకు, మీడియాకు తన కేసులకు సంబంధించిన వాస్తవాలు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు ప్రత్యేకంగా వెబ్ సైటే ప్రారంభించాడు. www.salmankhanfiles.com పేరుతో రూపొందించిన ఈ వెబ్ సైట్లో తన కేసుకు సంబంధించిన తాజా వివరాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటారు. తన గురించి వాస్తవాలు ఎప్పటికప్పుడు వెల్లడించేందుకే ఈ వెబ్ సైట్ ప్రారంభించినట్లు సల్మాన్ ఖాన్ స్పష్టం చేసారు.

    సల్మాన్ ఖాన్ కేసు తాజా వివరాల్లోకి వెళితే...నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని 'సల్మాన్'పై కేసు నమోదైంది. అప్పటి నుండి కేసు విచారణ జరుగుతోంది. చనిపోయిన వ్యక్తి నిర్లక్ష్యంగా నడుస్తూ కారుకు అడ్డంగా రావడంతోనే మృతి చెందాడని సల్మాన్ తరపున న్యాయవాది వాదించారు. 'సల్మాన్'పై నేరం రుజువైతే మాత్రం పది సంవత్సరాల జైలు శిక్ష పడేది ఖాయమని న్యాయవాదులు పేర్కొంటున్నారు.

    English summary
    In a relief to Bollywood superstar Salman Khan, the Bombay High Court on Monday stayed proceedings against him in a magistrate's court on a private complaint seeking contempt action against him for posting court orders in cases against him on his website. Salman's lawyer Ravi Kadam pleaded that the 2002 hit-and-run case involving the actor had been committed to sessions court for trial and hence the magistrate had no jurisdiction to issue notice to him on the contempt complaint filed against him by activist Hemant Patil.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X