»   » సంచలన విజయం అందుకొన్న యువ నిర్మాత ..!?

సంచలన విజయం అందుకొన్న యువ నిర్మాత ..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'100% లవ్‌" సినిమా కేవలం ఓవర్సీస్‌ మరియు ఎ సెంటర్స్‌ కు మాత్రమే పరిమితమవుతుందని అనుకున్నాం. కానీ మా అంచనాలకు భిన్నంగా ఈ చిత్రం బి సెంటర్స్‌ లో మాత్రమే కాదు.. సి సెంటర్స్‌ లోనూ రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతోంది" అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు యువ నిర్మాత బన్నీవాసు. అల్లు అర్జున్‌ అలియాస్‌ బన్నీకి అత్యంత ఆత్మీయ మిత్రుడైన వాసును అందరూ 'బన్నీవాసు" అంటుంటారు. ఆవిధంగా 'బన్నీ" అనేది ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. బన్నీవాసు నిర్మాతగా పరిచయమవుతూ అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై సుకుమార్‌ దర్శకత్వంలో నాగచైతన్య-తమన్నా జంటగా రూపొం దిన '100% లవ్‌" అనూహ్యరీతిలో అసాధారణ విజయం సాధిస్తుండడం తెలిసిందే. ఈ సందర్భంగా తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు బన్నీవాసు.

'ఈ చిత్రాన్ని 85 రోజుల్లో 10.5 కోట్లతో తీయాలని ప్లాన్‌ చేసాం. అయితే సమ్మె వలన ఒక వారం రోజులు అదనంగా షూట్‌ చేసాం. రిలీజ్‌ పరంగా జరిగిన డిలే వల్ల.. వడ్డీల రూపంలో అదనంగా ఓ పదిశాతం బడ్జెట్‌ పెరిగింది. అంటే ఈ చిత్రాన్ని మేము 92 రోజుల్లో 12 కోట్ల బడ్జెట్‌ తో తీసాం. అలాగే '100% లవ్‌" అనే టైటిల్‌ పెట్టాలా.. వద్దా? అని చాలా రోజులు తర్జనభర్జన పడ్డాం. ఈ చిత్రం ఇంత పెద్ద స్థాయిలో విజయం సాధిస్తుందని అస్సలు ఊహించలేదు. ఈ క్రెడిట్‌ మొత్తం అరవింద్‌ గారికి- సుకుమార్‌ లకే చెందుతుంది. మనం తినే ప్రతి బియ్యపు గింజపైనా మన పేరు రాసుంటుందని అంటారు. కానీ నేను తినే ప్రతి బియ్యపు గింజపై ఒకవైపు బన్నీ పేరు, మరోవైపు అల్లు అరవింద్‌ గారి పేరు రాసుంటాయి. వారిద్దరి రుణం ఈ జన్మలోనే కాదు.. ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను" అంటూ తన ఆనందానుభూతిని పంచుకున్నారు తొలిప్రయత్నంలోనే సంచలన విజయం అందుకున్న యువనిర్మాత 'బన్నీవాసు".

English summary
Naga Chaitanya and Tamanna acted as main lead in the movie 100%love produced by Bunny vasu under the banner Geetha Arts, the film unit hav organized a success meet considering the success of the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu