»   » పవన్ కళ్యాణ్‌కి సపోర్టు ఇవ్వం, నిర్మాత సెన్సేషన్ కామెంట్స్!

పవన్ కళ్యాణ్‌కి సపోర్టు ఇవ్వం, నిర్మాత సెన్సేషన్ కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ రంగంలో ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండే నిర్మాత సి.కళ్యాణ్ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో దిగితే....అతనికి సినీ రంగం నుండి ఎలాంటి సపోర్టు లభించదని తేల్చి చెప్పారు.

ఆపండి: ఆమె స్థాయి ఎక్కడ? పవన్ కళ్యాణ్ ఎక్కడ? 

'పవన్ కళ్యాణ్ చేసే రాజకీయాలకు సినిమా రంగం నుండి ఎలాంటి సపోర్టు ఉండదు. సినిమాలు, రాజకీయాలు రెండు వేర్వేరు. ఆయన ఒక నటుడిగా సినిమాలకు సంబంధించి మద్దతు కోరితే ఇస్తాం, ఆయన జనసేన ప్రెసిడెంటుగా రాజకీయ మద్దతైనా కోరితే ఎవరూ ఇవ్వరు' అని ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సి.కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ 'తొలి ప్రేమ' హీరోయిన్ షాకింగ్ లుక్

పవన్ కళ్యాణ్ పార్టీ గురించి కూడా సి కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 'ఒక వేళ పవన్ కళ్యాణ్ తనను ఆయన పార్టీలో చేరాలని ఆహ్వానించి, జనసేన పార్టీ తరుపున పోటీ చేయాలని కోరినా తాను పోటీ చేయను' అని సి కళ్యాణ్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో తన జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని, అభ్యర్థులను బరిలోకి దింపుతానని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సి కళ్యాణ్ కామెంట్స్ మీద పలువురు విమర్శిస్తున్నారు. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సి .కళ్యాణ్ లాంటి వ్యక్తులను పవన్ కళ్యాణ్ తన పార్టీలో చేరుకునే అవకావమే లేదంటున్నారు.

స్లైడ్ షోలో పవన్ కళ్యాణ్ తాజా సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు...

న్యూ లుక్

న్యూ లుక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తర్వాతి సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. పాత్రకు తగిన విధంగా ఆయన బరువు పెరగడంతో పాటు హెయిర్ స్టైల్ కూడా మార్చి స్టైలిష్ గా తయారయ్యాడు.

మళ్లీ వారే..

మళ్లీ వారే..

ఇంతకు ముందు ‘సర్దార్' మూవీని పవన్, ఆయన స్నేహితుడు శరత్ మరార్ కలిసి నిర్మించారు. ఈ సినిమాను కూడా వీరే నిర్మిస్తున్నారు.

తన వాటా

తన వాటా

పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు తన వాటాగా రెమ్యూనరేషన్ భారీగా తీసుకుంటున్నారు. ఈ సినిమాకు ఆయన ఏకంగా రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

సర్దార్ నష్టాలు పూడ్చాలి

సర్దార్ నష్టాలు పూడ్చాలి

సర్దార్ నష్టాలు ఈ సినిమాతో పూడ్చాలనే నిర్ణయంతో ఉన్నారు. ఆ సినిమా వల్ల నష్టపోయిన పంపిణీదారులను పవన్ కళ్యాణ్ ఆదుకోబోతున్నారు.

English summary
Producer C Kalyan has yet again made few sensational comments on actor-politician Pawan Kalyan. Commenting on Pawan Kalyan's foray into direct elections, C Kalyan opined that he wouldn't get any support from the film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu