»   » శాంతి, భద్రతలకు విఘాతం.. శరణం గచ్ఛామికి సీబీఎఫ్‌సీ నో సర్టిఫికెట్

శాంతి, భద్రతలకు విఘాతం.. శరణం గచ్ఛామికి సీబీఎఫ్‌సీ నో సర్టిఫికెట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు చిత్రానికి సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెట్ (సీబీఎఫ్‌సీ) సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించడం వివాదాస్పదంగా మారింది. కుల రిజర్వేషన్ల నేపథ్యంగా రూపొందిన శరణం గచ్ఛామి చిత్రం విడుదలకు సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు అధికారులు పలు అభ్యంతరాలు తెలిపారు. 'ఈ చిత్రం విడుదలైతే శాంతి, భద్రతలకు విఘాతం కలుగుతుంది. పలు ప్రాంతాల్లో అల్లర్లు చోటుచేసుకొనే ప్రమాదం ఉంది' అనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేయడం గమనార్హం.

 CBFC denies certification to Sharanam Gachchami

శరణం గచ్ఛామి చిత్రాన్ని తెలంగాణలోని వరంగల్‌కు చెందిన ప్రేమ్‌రాజ్ ఎనుముల దర్శకత్వం వహించారు. ప్రేమ్‌రాజ్ గతంలో జగపతిబాబుతో 'నగరం నిద్రపోతున్న వేళ' అనే చిత్రాన్ని రూపొందించారు. జనవరి తొలివారంలో హైదరాబాద్‌లోని సెన్సార్ బోర్డు ప్రాంతీయ కార్యాలయానికి పంపించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 12న అధికారులు వీక్షించారు. విడుదల చేసేందుకు అవసరమయ్యే సెన్సార్ సర్టిఫికెట్‌ను ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో ఈ చిత్రాన్ని కేంద్ర సెన్సార్ బోర్డుకు పంపించారు.

 CBFC denies certification to Sharanam Gachchami

ఈ సందర్భంగా దర్శకుడు ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ.. చిత్రంలో ఏమైనా అభ్యంతరకరమైన డైలాగ్స్, సన్నివేశాలు ఉంటే తొలగించడానికి సిద్ధమని చెప్పానని, అయితే ఈ చిత్రం పూర్తిగా అభ్యంతరకరమే అని చెప్పారని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఈ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్టు లేఖను పంపారని ఆయన పేర్కొన్నారు. ఓ తెలుగు చిత్రానికి సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ నిరాకరించడం ఇదే తొలిసారి అని ఆవేదన వ్యక్తం చేశారు.

 CBFC denies certification to Sharanam Gachchami

ఈ వివాదంపై మీడియా ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారిన వెంకట రాజశేఖరంను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఈ వ్యవహారంపై స్పందించడానికి నిరాకరించారు. శరణం గచ్ఛామి చిత్రం రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నదని, సమాజంలోని కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఈ చిత్రాన్ని రూపొందించారని లేఖలో అధికారులు పేర్కోవడం గమనార్హం.

English summary
CBFC rejected certification to Telugu Movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu