»   » మంచు మనోజ్ వెడ్డింగ్: సంగీత్ వేడుకలో స్టార్ల సందడి (ఫోటోస్)

మంచు మనోజ్ వెడ్డింగ్: సంగీత్ వేడుకలో స్టార్ల సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు మనోజ్-ప్రణతి రెడ్డి పెళ్లికి మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో మంచు వారి ఇంట పెళ్లి వేడుక సంబరాలు అంబరాన్నంటాయి. తాజాగా పెళ్లికి ముందు నిర్వహించే సంగీత్ సెర్మీ పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీతారలు హాజరై సందడి చేసారు. డాన్స్ చేసి అదరగొట్టారు.

గత పది రోజుల నుండి పెళ్లి సంబరాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కడ చూసినా మంచు మనోజ్ పెళ్లి వేడుక గురించే చర్చించుకుంటున్నారు. అంతగ్రాండ్ గా వేడుక నిర్వహిస్తున్నారు. ఇటీవల మనోజ్ కు నలుగు పెట్టే కార్యక్రమం, పెళ్లి కొడుకును చేసే వేడుక సందడిగా సాగింది. తెలుగు ఇండస్ట్రీ బిగ్ షాట్స్ చిరంజీవి, బాలకృష్ణ తదితరులు హాజరై మనోజ్ ను ఆశీర్వదించారు.

ఈ నెల 20వ తేదీ ఉదయం 9.10 గంటలకు మనోజ్-ప్రణతి వివాహం జరుగబోతోంది. అంతకంటే ముందు లక్ష్మి మంచు ఇంట్లో మెహందీ సెర్మనీ నిర్వహించనున్నారు. హైటెక్స్ వివాహ వేడుక గ్రాండ్ గా జరుగబోతోంది. ఈ పెళ్లి వేడుకకు దాదాపు 10వేల మందికి పైగా అథితులు హాజరవుతారని సమాచారం. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

సంగీత్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో

హన్సిక

హన్సిక


మంచు మనోజ్ వివాహ వేడుకలో భాగంగా జరిగిన సంగీత్ కార్యక్రమానికి హీరోయిన్ హన్సిక హాజరైంది. హన్సిక తన ట్విట్టర్లో ఈ ఫోటో పోస్టు చేసింది.

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి


తన డిజైనర్ ఫ్రెండ్ సిడ్నీ స్లాడెన్ తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చి మనోజ్ సోదరి మంచు లక్ష్మి.

త్రిష-హన్సిక

త్రిష-హన్సిక


మంచు మనోజ్ సంగీత్ వేడుకలో త్రిష, హన్సిక పెనవేసుకుపోయారు..

తమిళ సినీ సెలబ్రిటీలు

తమిళ సినీ సెలబ్రిటీలు


మంచు మనోజ్ సంగీత్ కార్యక్రమానికి హాజరైన తమిళ సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్ , ఫ్రెండ్స్.

మంచు విష్ణు సెల్ఫీ

మంచు విష్ణు సెల్ఫీ


హన్సిక, శ్రీయ రెడ్డి, విక్రమ్ ప్రభులతో కలిసి సెల్పీ ఫోజులు ఇస్తున్న మనోజ్ సోదరుడు మంచు విష్ణు.

మంచు మనోజ్ సంగీత్

మంచు మనోజ్ సంగీత్


హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో మనోజ్ సంగీత్ వేడుక గ్రాండ్ గా జరిగింది.

సెలబ్రిటీల సందడి

సెలబ్రిటీల సందడి


పలువురు సెలబ్రిటీలు మంచు మనోజ్ సంగీత్ కార్యక్రమంలో సందడి చేసారు.

త్రిష

త్రిష


మంచు మనోజ్ సంగీత్ వేడుక సందర్భంగా ఫోటోలకు ఫోజులు ఇస్తున్న త్రిష.

English summary
With Manchu Manoj and Pranathi Reddy wedding is just two days away, the celebrations are touching the sky. Yesterday day, the sangeet function was celebrated in a grand scale amidst celebrities from all the film industries.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu