»   » ‘చందమామలో అమృతం’ గురించి గుణ్ణం గంగరాజు

‘చందమామలో అమృతం’ గురించి గుణ్ణం గంగరాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :టీవీ చూసే ప్రేక్షకులకు చిరపరిచితమైన సీరియల్ 'అమృతం'. హర్షవర్థన్, గుండు హనుమంతరావులు ప్రధాన పాత్రలు పోషించిన ఆ సీరియల్‌ను జస్ట్ ఎల్లో మీడియా ప్రై.లి. పతాకంపై 'చందమామలో అమృతం'టైటిల్ తో సినిమాగా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, హరీష్ హీరోలుగా నటిస్తున్నారు. అప్పాజీగా శివన్నారాయణ, సర్వంగా వాసు ఇంటూరి తమ పాత్రల్లో తామే నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ మొదటి వారంలో ఆడియోని,మూడో వారంలో సినిమాని విడుదల చేయటానికి గుణ్ణం గంగరాజు నిర్ణయించారు.

ఈ విషయమై గుణ్ణం గంగరాజు మాట్లాడుతూ.. "దాదాపు సినిమాలో మూడు వంతులు చంద్రుడుపై జరుగుతుంది. 44 నిముషాల పాటు స్పేస్ లోనే జరుగుతుంది. ముఖ్యంగా 19 నిముషాల గ్రాఫిక్స్ అద్బుతంగా ఉంటాయి. మేము ఊహించిన దానికన్నా విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ సమయం పట్టింది. డిసెంబర్ మూడో వారంలో సినిమాని విడుదల చేస్తాం." అన్నారు.

అలాగే 'చంద్రమండలంపై జరిగే కథ ఇది. ఓ గొప్ప అంతరిక్ష చిత్రం అని కూడా చెప్పొచ్చు. రెండున్నర గంటలపాటు కడుపుబ్బా నవ్వించేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. బుల్లితెరపై ప్రసారమైన ధారావాహికకు ఈ సినిమాకీ మధ్య ఎలాంటి సంబంధం లేదు. కేవలం అందులోని పాత్రలు మాత్రమే ఈ చిత్రంలో కనిపిస్తాయి. ధారావాహికల్లో కనిపించే పాత్రలతో సినిమాల్ని తీయడం అరుదు. ఇదివరకు మిస్టర్‌ బీన్‌ తరహాలో కొన్ని పాత్రలు మాత్రమే వెండితెరపై సందడి చేశాయి. మేం తొలిసారిగా తెలుగులో ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో యాభై నిమిషాలపాటు గ్రాఫిక్స్‌ ఉంటాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం ''అన్నారు.

Chandamama Lo Amrutham

మన దేశంలో తొలిసారిగా స్పేస్ నేపధ్యంలో తీస్తున్న చిత్రం 'చందమామలో అమృతం'. ఈ చిత్రం దసరాకు విడుదలకానుంది. మొదట ఈ సినిమా ఆగష్టులో విడుదల ప్లాన్ చేసారు. కానీ గ్రాఫిక్స్ వర్క్ డిలే కావంటంతో ఈ సినిమా దసరాకు వాయిదా వేసారు. ఇక ఈ చిత్రం సెకండాఫ్ మొత్తం చంద్రుడిపై జరుగుతుంది. సుచిత్ర, ఆహుతిప్రసాద్‌, చంద్రమోహన్‌, కృష్ణ భగవాన్‌, ఎల్‌.బి.శ్రీరామ్‌, రావు రమేష్‌ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్‌, సంగీతం: శ్రీ, కూర్పు: ధర్మేంద్ర, పాటలు: అనంత శ్రీరామ్‌.

English summary
Chandamama Lo Amrutham, based on Amrutham TV serial, is gearing up for release in December.The film’s second half unfolds on the moon, making it the first Indian film to be set in space.Srinivas Avasarala, Harish, Vasu Inturi and Dhanya Balakrishnan will be seen in lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu