»   » ఆ నలుగురు ఫేమ్ చంద్రసిద్దార్ధ,మదన్ మళ్ళీ కలిసి...

ఆ నలుగురు ఫేమ్ చంద్రసిద్దార్ధ,మదన్ మళ్ళీ కలిసి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజేంద్రప్రసాద్ తో ఆ నలుగురు వంటి విలువలు కలిగిన చిత్రం రూపొందించిన దర్శకుడు చంద్ర సిద్దార్ద, రచయిత మదన్ మళ్ళీ కలిసి ఓ చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ చిత్రం టైటిల్ ..ఈ పాట కోరినవారు గంభీరరావు పేట గంగపుత్ర కాలనీ నుంచి రామ జోత్స, రవి, కిరణ్, చందు మొదలైనవారు.పెద్దగా కనపుడుతున్న ఈ టైటిల్ మంచి ఫీల్ కలిగిస్తుందని భావిస్తున్నారు. ఇక ఆ నలుగురు అనంతరం చంద్రసిద్దార్ధ ..మదన్ లేకుండా అందరి బంధువయా, ఇదీ సంగతి వంటి చిత్రాలు రూపొందించారు కానీ అవేమీ భాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. అలాగే ఆ నలుగురు అనంతరం మదన్ దర్శకుడుగా మారి పెళ్ళయిన కొత్తలో చిత్రం తో హిట్ కొట్టారు.ఆ సినిమా తర్వాత ప్రవరాఖ్యుడు చిత్రంతో మళ్ళీ మొదటికి వచ్చారు. దాంతో తమ కాంబినేషన్ తో తిరిగి ఇద్దరూ నిలబడాలని ప్రయత్నం చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఇంకా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంపిక కానీ ఈ చిత్రం మళ్ళీ ఆనలుగురు వంటి హిట్ కావాలని కోరుకుందాం.

English summary
Now writer Madan pens a script for Chandra Siddhartha. Interestingly their new film has a lengthy title - Ee Paata Korinavaru Gambhirraopeta Gangaputra Colony Nunchi Rama Jyothsna, Ravi, Kiran, Chandu Modalaguvaaru.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu