»   » నేను ఏ దర్శకుడినీ కొట్టలేదు: చార్మి

నేను ఏ దర్శకుడినీ కొట్టలేదు: చార్మి

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: హీరోయిన్ చార్మి వ్యవహారం ఇటీవల హాట్ టాపిక్ గా మారి సంగతి తెలిసిందే. చార్మి ఇటీవల ఓ దర్శకుడి చెంప చెల్లుమనిపించిందని, అతను తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వల్లనే చార్మి ఇలా చేసిందని ఆ వార్తల సారాంశం. ఆ దర్శకుడు ఎవరో కాదు హరీష్ శంకరే అనే గాసిప్స్ కూడా వెలువడ్డాయి.

  చార్మి ఈ వార్తలపై మౌనం వహించడంతో ఈ సంఘటన నిజమే అనే భావనకు అంతా వచ్చారు. ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి ఇండస్ట్రీ ప్రముఖుల చెవిన పడింది. ఇంత జరుగుతున్నా స్పందించక పోవడం చార్మి తప్పే, దీని వల్ల ఆ దర్శకుడికి, ఇండస్ట్రీకి చెబ్బపేరు వస్తుందని ఆమెపై ఒత్తిడులు పెరిగాయి.

  ఈ నేపథ్యంలో చార్మి స్పందించక తప్ప లేదు. 'మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా నేను ఎవరినీ కొట్టలేదు' అంటూ ట్విట్టర్ ద్వారా స్పందించింది చార్మి. దీంతో చార్మి, దర్శకుడు హరీష్ శంకర్ లపై జరుగుతున్న పుకార్లకు తెర పడ్డట్లు అయింది. ఏది ఏమైనా ఈ సంఘటన చార్మికి భవిష్యత్‌లో ఎలాంటి కష్టాలు తెస్తుందో ఏమో?

  ఇతర వివరాల్లోకి వెళితే...
  ఈ మధ్య హీరోయిన్ అవకాశాలు లేక పోవడంతో చార్మి ఐటం సాంగులు చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల ఆమె డమరుకం చిత్రంలో నటించిన 'సక్కుబాయ్ చాయ్' పాట సూపర్ హిట్టవడంతో చాల మంది ఆమెతో స్పెషల్ సాంగులు చేయించడానికి ఇంట్రస్టు చూపుతున్నారు. చార్మి ప్రస్తుతం నాయక్ చిత్రంలో కూడా రామ్ చరణ్ తో కలిసి మాస్ మసాలా ఐటం సాంగు చేస్తోంది.

  English summary
  “As per the rumors doing the rounds I didn't slap anyone.. Thanks.” Charmi tweeted. Charmi will be sharing the screen space with Ram Charan in the item number 'Nellore', which is currently being canned in Ramoji Film City. Nayak audio was recently released and has got a good response and 'Nellore' number is tipped as one of the best item songs in the recent past.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more