Don't Miss!
- News
కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ బిగ్ స్కెచ్- ఏపీ సహా: 12 రోజుల పాటు..!!
- Finance
Jio laptop: మార్కెట్లోకి Jio ల్యాప్ ట్యాప్.. ఫీచర్లు, ధర చూస్తే వావ్ అనాల్సిందే !!
- Sports
INDvsNZ : మూడో టీ20లో ఈ రికార్డులు బద్దలవడం ఖాయం.. సూర్య సాధిస్తాడా?
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
కాబోయేవాడికి అది కాస్త ఉండాలి: ఛార్మి
అలాగే ఇప్పటి వరకూ అయితే పెళ్లి ఆలోచన రాలేదు. అయినా నా వయసెంతండీ? ఇంకా కొన్ని రోజులు అమ్మానాన్నల మధ్య హాయిగా గడుపుతా. అయినా నా నిర్ణయాలు చాలా అనూహ్యంగా ఉంటాయి. ఆ క్షణం నా మనసుకి ఏదనిపిస్తే అది చేస్తాను. ఓ గంట తరవాత పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే ఆ ప్రయత్నం మొదలుపెడతానంతే అంది.
తన వయస్సు గురించి చెప్తూ...వయసు దాచుకోవడం నాకు ఇష్టం ఉండదు. అలా చేయడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. శుక్రవారంతో పాతికేళ్లు పూర్తవుతాయి. పదమూడేళ్ల వయసులో సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. పన్నెండేళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నాను. ఇప్పటిదాకా వయసుకు మించిన పాత్రల్లో నటించాను. రేపట్నుంచి నాకు తగ్గ పాత్రల్లోనే నేను కనిపించబోతున్నాను అంది.
తొలినాళ్లల్లో అందంతో ఆకట్టుకొన్న ఈ ముద్దుగుమ్మ... ఆ తరవాత అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించింది. 'మంత్ర', 'మంగళ' చిత్రాలతో కథానాయిక ప్రాధాన్యమున్న కథలకి చిరునామాగా నిలిచింది. ఇటీవల 'ప్రేమ ఒక మైకం' అనే చిత్రంలో వేశ్యగా నటించింది. ఆ చిత్రం వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తుంది. శుక్రవారం ఛార్మి జన్మదినం. ధట్స్ తెలుగు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.