»   » గబ్బర్ సింగ్-2 : లీక్ డైలాగ్స్ హల్ చల్...

గబ్బర్ సింగ్-2 : లీక్ డైలాగ్స్ హల్ చల్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టార్ హీరో సినిమా వస్తోందంటే... ఆ సినిమాకు సంబంధించి సందడి కూడా మొదలవుతుంది. ఫస్ట్ లుక్ లీక్, డైలాగ్స్ లీక్, టీజర్ లీక్, సీన్లు లీక్ ఇలా ఈ మధ్య కాలంలో లీకుల వ్యవహారం బాగా ఎక్కువైంది. ఈ లీకుల్లో కొన్ని నిజమైన లీకులైతే, మరికొన్ని ఫేక్ లీకులు.

ఇదే తరహాలో త్వరలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్-2 సినిమా మొదలవుతున్న నేపథ్యంలో లీక్ డైలాగులు అంటూ కొన్ని ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇవి నిజమైనవో లేక అభిమానులు కావాలని సృష్టించి వదిలిన డైలాగులో తేలాల్సి ఉంది. ఆ డైలాగులపై మీరూ ఓ లక్కేయండి.

  • పవర్ ను వాడుకో బాగుపడతావ్.. కానీ ముట్టుకోవాలనుకోకు... చచ్చిపోతావ్..
  • నేను టెంపర్ లాసయితే, టెంపో లేకుండా కొడతా...
  • నేను పంచ్ లేస్తే విజిల్స్ పడతాయ్... అదే నాపైన పంచ్ లు వేయాలని ట్రై చేస్తే నేనిచ్చే కౌంటర్ కు నువ్వు ఎన్ కౌంటరవుతావ్..
  • అరె హౌలే...నేను గుర్రాన్ని కాదు బే... నువ్వెక్కి సవారీ చేయడానికి... సింహాన్ని...
  • ఎవడుకొట్టినా బ్లడ్డొస్తుంది...కానీ నేను కొడితే, బ్లడ్ తో పాటు భయం కూడా వస్తుంది...
  • కరెంట్ తీగలో పవర్... పవన్ వంట్లో పొగరు పైకి కనబడవురా... దాన్ని పట్టుకున్నా, నాతో పెట్టుకున్నా సేమ్ డెత్..
  • మొన్న తిక్క చూపించా... ఇప్పుడు చుక్కలు చూపిస్తా...
  • నా తిక్కేంటో చూపిస్తే- నువ్వు జనాభా లెక్కల్లో లేకుండా పోతావ్...
Check out: Gabbar Singh 2 leaked dialogues

గబ్బర్ సింగ్ 2 సినిమా విశేషాల్లోకి వెళితే...ఇటీవల గబ్బర్ సింగ్ 2 మొదటి షెడ్యూల్ పూర్తయింది. అయితే పవన్ కళ్యాణ్ ఇంకా షూటింగులో జాయిన్ కాలేదు. త్వరలోనే ప్రారంభం అయ్యే సెకండ్ షెడ్యూల్‌లో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నాడు.

'గబ్బర్ సింగ్-2' ఫస్ట్ లుక్ ను తన అన్నయ్య చిరంజీవి పుట్టినరోజయిన ఆగస్టు 22న విడుదల చేయాలనీ పవన్ భావిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా...'గబ్బర్ సింగ్' సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను అప్పట్లో గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో చిత్రీకరించారు. ఇప్పుడు 'గబ్బర్ సింగ్ -2' షూటింగ్ కూడా కొంత అక్కడే చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈవిషయమై ఇంకా అఫీషియల్ సమాచారం లేదు.

ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అనీష అంబ్రోసేని ఎంపిక చేసారు. మరో హీరోయిన్ ఖరారు కావాల్సి ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో పవన్ గెడ్డం పెంచుకుని కనపడతారని తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ గెడ్డాలతో షూటింగ్ ఎందుకని, పవన్ తనే స్వయంగా గెడ్డం పెంచుకున్నారని సమాచారం. ఈ గెడ్డంతో వచ్చే ఎపిసోడ్ సినిమాలో హైలెట్ గా నిలువనుందని చెప్పుకుంటున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోనే ...సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు.

English summary
Pawan Kalyan's Gabbar Singh 2 leaked dialogues Goes viral on social media.
Please Wait while comments are loading...