»   » చిరంజీవి బర్త్ డే: భారీగా హోర్డింగులు! (ఫోటోస్)

చిరంజీవి బర్త్ డే: భారీగా హోర్డింగులు! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లో హంగామా మొదలైంది. ఈ సారి ప్రత్యేకత 60వ పుట్టినరోజు వేడుకలు భారీ ఎత్తున ప్లాన్ చేసారు. గత వారం రోజుల నుండి చిరంజీవి అభిమాన సంఘాల తరుపున వారోత్సవాలు నిర్వహిస్తున్నసంగతి తెలిసిందే. అన్నదానం, రక్తదానం రకరకాల సేవా కార్యక్రమాల్లో అభిమానులు నిమగ్నమయ్యారు.

హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో అభిమానుల ఈ రోజు మధ్యహ్నం నుండి అర్ధరాత్రి వరకు భారీ వేడుక నిర్వహిస్తున్నారు. పరిసర ప్రాంతాలను చిరంజీవి ఫోటోలతో కూడిన హోర్డింగులతో నింపేయబోతున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో హోర్డింగులు రెడీ అయ్యాయి.

మరో వైపు చిరంజీవి పుట్టినరోజు వేడుక సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో ఆయన తనయుడు రామ్ చరణ్ గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ రేంజికి తగిన విధంగా ఈ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏ సినీ స్టార్ పుట్టినరోజు వేడుకలు ఈ రేంజిలో జరుగలేదు. మెగా అభిమానులు ఈ పుట్టిన రోజు వేడుకలను పండగలా జరుపుకుంటున్నారు. స్లైడ్ షోలో ఫోటోస్..

చిరు బర్త్ డే సెలబ్రేషన్స్

చిరు బర్త్ డే సెలబ్రేషన్స్

చిరంజీవి పుట్టినరోజు వేడుకల కోసం సిద్ధమైన హోర్డింగులు

సూపర్ లుక్

సూపర్ లుక్

60వ వడిలో అడుగు పెడుతున్న తరుణంలోనూ మెగాస్టార్ చిరంజీవి సూపర్ లుక్ తో కనిపిస్తుండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

అదే జోష్

అదే జోష్

చిరంజీవి ఇప్పటి కుర్ర హీరోలతో పోటీ పడి డాన్స్ చేయగల సామర్థ్యం కలిగి ఉండటం గమనార్హం.

హ్యాపీ బర్త్ డే

హ్యాపీ బర్త్ డే

చిరంజీవి ఇప్పటి నుండి సినిమాల్లో బిజీ కావాలని, తమను ఎంటర్టెన్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

English summary
Megastar Chiranjeevi birthday celebrations in Grand way.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu