»   » చిరు బర్త్ డే: అమితాబ్, రజనీ, సల్మాన్‌లకు ‘చిరంజీవి దోసె’

చిరు బర్త్ డే: అమితాబ్, రజనీ, సల్మాన్‌లకు ‘చిరంజీవి దోసె’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్‌ చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకలు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో గ్రాండ్ గా జరుగబోతున్నాయి. బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమల నుండి పలువురు ప్రముఖులు ఈ పుట్టినరోజు వేడుకలకు హాజరు కాబోతున్నారు.

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, ఆయన భార్య జయాబచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌, అతడి కుటుంబ సభ్యులు, కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, శ్రీదేవి, బోనీ కపూర్‌, టబూ ఇలా పలువురు స్టార్స్ ఈ బర్త్ డే వేడుకలకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ష్టష్ఠి పూర్తి వేడుక ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా జరుపబోతున్నారు.

Chiranjeevi's special treat to his guests on his 60th!

చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌ పార్టీని గ్రాండ్ గా జరుపాలని పక్కాగా ప్లాన్ చేసాడు. ప్రముఖుల ఆహ్వానాల దగ్గర నుండి ఏర్పాట్ల వరకు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ వేడుకల్లో ప్రత్యేక వంటకాలు అతిథుకు వడ్డించనున్నారు. ఇందులో ‘చిరంజీవి దోసె' ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఈ పుట్టినరోజు వేడుకల్లో చిరంజీవి ఇంటి హెడ్ కుక్ శ్రీను..... చిరంజీవి దోసెను స్వయగా వేసి అతిథులకు వడ్డించబోతున్నాడు. కనీ వినీ ఎరుగని నీతిలో భారీగా ఖర్చు పెట్టి రామ్ చరణ్ ఈ పుట్టినరోజు వేడుక నిర్వహిస్తున్నారు. దేశం మొత్తం చిరంజీవి పుట్టినరోజు వేడుకలు హాట్ టాపిక్ అవుతోంది.

English summary
The biggest names of South and Bollywood are coming together to be a part of Superstar Chiranjeevi's 60th birthday and celebrate his 35 years in the Indian Film Industry. Ram Charan, the superstar actor's son is personally leading all the arrangements, including the decor, guest list, entertainment and food.
Please Wait while comments are loading...