twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫైనల్ అయిపోయింది... ఉయ్యాలవాడ గా మెగాస్టార్, ఎవరీ నరసింహారెడ్డి తెలుసా??

    మెగాస్టార్ చేయబోయే సినిమా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డేనా కాదా అన్న డైలమాలో చాలామందే ఉన్నారు, ఇప్పుడు వచ్చిన సమాచారం తో మనం నరసింహా రెడ్డిగా చిరు ఎంట్రీ పక్కా అని ఫిక్స్ అయిపోవచ్చు

    |

    ఖైదీనెం 150 తర్వాత మెగాస్టార్ చేయబోయే సినిమా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డేనా కాదా అన్న డైలమాలో చాలామందే ఉన్నారు. ఒకసారి కన్ ఫార్మ్ అనీ మరో సారి తూచ్..తూచ్..! వేరే మాస్ సినిమా అనీ ఏవేవో వార్తలు వినిపిస్తూ మరింత అయోమయానికి గురి చేసాయి. మొన్నటికి మొన్న హీరో శ్రీకాంత్ చెప్పాక కొంత నమ్మకం కుదిరింది జనాలకి.. అయినా ఇంకా ఎక్కడో అనుమానమే ఎందుకంటే ఇటు మెగా కాంపౌండ్ నుంచి గానీ, అటు ఈ సినిమాకి దర్శకత్వం వహించబోయే సురేంద్ర రెడ్డి గానీ అధికారికంగా చెప్పకపోవటమే. అయితే ఇప్పుడు వచ్చిన సమాచారం తో మనం ఇక ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరు ఎంట్రీ పక్కా అని గట్టిగా ఫిక్స్ అయిపోవచ్చు.....

     151వ సినిమాకి

    151వ సినిమాకి

    ఖైదీ నంబర్ 150తో ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు తన 151వ సినిమాకి రెడీ అయిపోతున్నారు. ధృవ టైమ్ లోనే తన తర్వాతి సినిమా చిరంజీవితో చేయబోతున్నట్లు సురేందర్ రెడ్డి చెప్పాడు కానీ.. అప్పట్లో ఇది పబ్లిసిటీ స్టంట్ అనుకున్నారంతా.

    ఫైనల్ స్క్రిప్ట్ ను సిద్ధం

    ఫైనల్ స్క్రిప్ట్ ను సిద్ధం

    కానీ మెగా151ని చేజిక్కించుకుని అందరికీ షాక్ ఇచ్చిన సూరి.. ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఫైనల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడట. నిన్ననే మెగాస్టార్ ను కలిసి.. తనకు ఇచ్చిన స్క్రిప్ట్ ని.. తను చేసిన మార్పులను.. చేసిన అప్ డేట్స్ ను అన్నిటినీ డీటైల్డ్ గా వివరించాడట.

     స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయింది

    స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయింది

    సూరి చేసిన మార్పులకు ముగ్ధుడైన మెగాస్టార్.. ఇదే స్క్రిప్ట్ ను లాక్ చేసేసుకోమని చెప్పారని తెలుస్తోంది. ఇప్పుడు స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయింది కాబట్టి.. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించేయమని కూడా చెప్పారట చిరు. అయితే.. స్క్రిప్ట్ దశలోనే క్యాస్టింగ్ విషయంలో సురేందర్ రెడ్డి ఓ డెసిషన్ కు వచ్చేశాడని తెలుస్తోంది.

    షూటింగ్ ను ఏప్రిల్ లో స్టార్ట్

    షూటింగ్ ను ఏప్రిల్ లో స్టార్ట్

    ఈ ప్రాజెక్ట్ పీరియాడికల్ మూవీ కావడంతో షూటింగ్ కి ఎక్కువ సమయం అవసరం కానుందని సమాచారం. అందుకే ఈ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' షూటింగ్ ను ఏప్రిల్ లో స్టార్ట్ చేసి.. మూవీని వచ్చే ఏడాది సమ్మర్ నాటికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఏదిఏమైనా, 1857 లో జరిగిన మొదటి భారత స్వాతంత్య్ర సమరం కంటే పదేళ్లకు ముందే దేశం కోసం ప్రాణం అర్పించిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు కనిపిస్తాడంటే.. అది సిల్వర్ స్క్రీన్ కు పండుగనే అనాలి

    కర్నూలు జిల్లాలో

    కర్నూలు జిల్లాలో

    నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో జన్మించి, ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాధల వల్ల తెలుస్తున్నది. ఈయన కడప, కర్నూలు అనంతరపురం, బళ్లారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గుళ్లదుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాలలో ఈయన నర్మించిన కోటలు నగరులు ఈనాటికీ ఉన్నాయి.

    తిరుగు బాటు మొదలైంది

    తిరుగు బాటు మొదలైంది

    1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం ఇప్పించమని తన అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపితే తాసీల్దారు తిట్టి, నరసింహారెడ్డి వస్తేనే ఇస్తా పొమ్మనడంతో రెడ్డిలో తిరుగు బాటు మొదలైంది. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడి దారులు రెడ్డి నాయకత్వంలో చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, అవుకు జమీందార్లు, హైదాబాదుకు చెందిన సలాంఖాన్‌, కర్నూలుకు చెందిన పాపాఖాన్‌, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరినవారిలో ఉన్నారు.

    బోయ సైన్యంతో దాడిచేసి

    బోయ సైన్యంతో దాడిచేసి

    1846 జులై 10 తేదీ రెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాలోని 805 రూపాయల, 10 అణాల, 4 పైసలను దోచుకున్నాడు. ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను కూడా దోచుకున్నాడు. బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టు కోవడానికి సైన్యాన్ని దింపింది.

    సైన్యంతో విరుచుకుపడి

    సైన్యంతో విరుచుకుపడి

    కెప్టెన్‌ నాట్‌, కెప్టెన్‌ వెయ్యి రూపాయల బహుమానాన్ని బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించింది. తరువాత జులై 23వ తేదీన కెప్టెన్‌ వాట్సన్‌ నాయకత్వంలో వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా, అర్థరాత్రి రెడ్డి, తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిషు సైన్యాన్ని పారదోలాడు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదు చేసింది ప్రభుత్వం. వారిని విడిపించుకునేందుకు కడప చేరాడు రెడ్డి.

    సైన్యంతో ముట్టడించి

    సైన్యంతో ముట్టడించి

    1846 అక్టోబర్‌ 6న నల్లమల కొండల్లోని పేరుసోమల జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్‌ కలెక్టర్‌ కాక్రేన్‌ సైన్యంతో ముట్టడించి రెడ్డిని బంధించాడు. నరసింహారెడ్డిని, అతని అనుచరులను విచారించిన బ్రిటిషు ప్రభుత్వం అతనికి ఉరిశిక్షను, అనుచరు లకు వివిధ ఇతర శిక్షలను విధించింది.

    బహిరంగంగా ఉరి

    బహిరంగంగా ఉరి

    1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బహిరంగంగా ఉరితీసింది. బ్రిటిషు ప్రభుత్వం. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు.

    English summary
    As per the sours Megastar Chiranjeevi today heard the final script of 'Uyyalavada Narasimha Reddy', Chiru is said to have asked the director now to begin the pre-production work and set work for it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X