»   » ఉయ్యాలవాడ ఫేక్ పోస్టర్ కూడా వైరల్ అయ్యింది : అదీ చిరు క్రేజ్

ఉయ్యాలవాడ ఫేక్ పోస్టర్ కూడా వైరల్ అయ్యింది : అదీ చిరు క్రేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఖైదీనెం 150 తర్వాత మెగాస్టార్ చేయబోయే సినిమా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డేనా కాదా అన్న డైలమాలో చాలామందే ఉన్నారు. ఒకసారి కన్ ఫార్మ్ అనీ మరో సారి తూచ్..తూచ్..! వేరే మాస్ సినిమా అనీ ఏవేవో వార్తలు వినిపిస్తూ మరింత అయోమయానికి గురి చేసాయి. మొన్నటికి మొన్న హీరో శ్రీకాంత్ చెప్పాక కొంత నమ్మకం కుదిరింది జనాలకి..

అయినా ఇంకా ఎక్కడో అనుమానమే ఎందుకంటే ఇటు మెగా కాంపౌండ్ నుంచి గానీ, అటు ఈ సినిమాకి దర్శకత్వం వహించబోయే సురేంద్ర రెడ్డి గానీ అధికారికంగా చెప్పకపోవటమే. అయితే ఇప్పుడు వచ్చిన సమాచారం తో మనం ఇక ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరు ఎంట్రీ పక్కా అని గట్టిగా ఫిక్స్ అయిపోవచ్చు.....

Chiranjeevi Uyyalawada Narasimha Reddy Movie fan made poster

ఈ సినిమా చిరు చేస్తున్నాడు అని తెలిసినప్పటి నుంచీ అభిమానుల్లో మరింత ఉత్సాహం కనిపించింది. ఇటీవలే ఆ చిత్రానికి సంబంధించి కొందరు అభిమానులు ఉత్సాహంతో ఓ పోస్టర్‌ను తయారు చేశారు. అసలు చిరు ఇలాగే ఉంటాడేమో అన్న ఊహా కి కూడా ఎంత క్రేజ్ ఉంటుందో అర్థమయ్యింది. ఎందుకంటే అది సినిమాకోసం కాదనీ ఏవరో క్రియేట్ చేసిన పోస్టర్ అని తెలిసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

తాజాగా ఆ సినిమాకు సంబంధించి మరో పోస్టర్ నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. చిరును ఉయ్యాలవాడగా ఊహించుకుని ఓ అభిమాని పెన్సిల్ స్కెచ్‌ను వేశాడు. ఈ స్కెచ్‌తో ఉయ్యాలవాడ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాడు సదరు అభిమాని. వచ్చే నెల నుంచే చిరు ఉయ్యాలవాడ షూటింగ్‌లో పాల్గొంటాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్న నేపథ్యంలో.. ఉయ్యాలవాడ కొత్త..కొత్త పోస్టర్లు అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. మరి, అభిమానులు సృష్టిస్తున్న పోస్టర్లే ఇంత ఆసక్తిని రేకెత్తిస్తే.. చిరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అసలు పోస్టర్లు ఇంకెంత ఆసక్తిని పెంచుతాయో!!

English summary
Chiranjeevi marked the biopic of 'Uyyalavada Narasimha Reddy' as his 101st. Surendar Reddy & Paruchuri Brothers have been dealing with the script since the couple of months. Now a fan made poster of Chiru with Uyyalawada Narasimhareddy gone Viral in Social meadia
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu