»   »  చిరు నాన్చుతున్నాడు...వినాయక్ తేల్చడం లేదు!

చిరు నాన్చుతున్నాడు...వినాయక్ తేల్చడం లేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివి వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమా ఖరారైనట్లు, తమిళంలో హిట్టయిన ‘కత్తి'చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై అఫీషియల్‌గా స్పందించడానికి అటు వివి వినాయక్ గానీ, ఇటు చిరంజీవి గానీ ముందుకు రావడం లేదు.

నిన్న బ్రూస్ లీ ఆడియో వేడుకలో కూడా చిరంజీవి తన 150వ సినిమా చరణ్ నిర్మిస్తున్నాడని చెప్పాడే కానీ, వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నట్లు మాత్రం చెప్పలేదు. ‘బ్రూస్ లీ' ఆడియో వేడుకపై చిరంజీవి మాట్లాడుతూ...నా 150వ సినిమా పూర్తిస్థాయిలో వుంటుంది. బ్రూస్‌లీ చిత్రం విడుదలయ్యే సమయానికి నిర్మాత రాంచరణ్, మరో నిర్మాత నా సతీమణి సురేఖ ఆ చిత్రానికి సంబంధించిన సమాచారాన్ని మీడియాకు తెలియజేస్తారు అని చిరంజీవి తెలిపారు.

Chiru 150: Vinayak not respond

వివి వినాయక్ కూడా ‘బ్రూస్ లీ' ఆడియో వేడుక సందర్భంగా మాట్లాడుతూ...అన్నయ్య ‘కత్తి'లా ఉన్నాడని వ్యాఖ్యానించాడే కానీ...చిరంజీవి 150వ సినిమా చేసే అవకాశం తనకు దక్కినట్లు మాత్రం చెప్పలేదు. ఆడియో వేడుక బయట కొందరు మీడియా వారు చిరంజీవి 150వ సినిమా విషయమై వివి వినాయక్‌ను అడిగే ప్రయత్నం చేయగా స్పందించడానికి నిరాకరించారు.

పరిస్థితి చూస్తుంటే... దసరా సందర్భంగా చిరంజీవి 150వ సినిమా విషయాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అప్పటి వరకు అభిమానులు ఆగాల్సిందే....

English summary
When media persons asked Vinayak about Kaththi remake with Chiru, he refused to confirm that he is directing the movie.
Please Wait while comments are loading...