»   » దాసరికి ‘అల్లు’ పురస్కారం: మాకు ఆయనే పెద్ద దిక్కు అన్న చిరంజీవి (ఫోటోస్)

దాసరికి ‘అల్లు’ పురస్కారం: మాకు ఆయనే పెద్ద దిక్కు అన్న చిరంజీవి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'దాసరి నారాయణరావు తెలుగు పరిశ్రమకు పెద్ద దిక్కు. చిత్ర పరిశ్రమకు దాసరి సేవలు ఇంకా అవసరం. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి' అని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు.

ఈ ఏడాది అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారానికి దాసరిని ఎంపిక చేసారు. గురువారం దాసరి పుట్టినరోజు సందర్బంగా అల్లు అరవింద్, చిరంజీవి స్వయంగా దాసరి నివాసానికి వెళ్లి అల్లు పురస్కారం ప్రధానం చేసారు. తన చేతుల మీదుగా దాసరికి ఈ అవార్డు అందజేయడం ఆనందంగా ఉందని చిరంజీవి తెలిపారు.

దాసరి పోరాట యోధుడు

దాసరి పోరాట యోధుడు

దాసరి గారు ఓ పోరాట యెధుడు. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయన్ని చూడడానికి ఆసుపత్రికి వెళ్లా. ఆ సమయంలోనూ నా సినిమా గురించి వాకబు చేశారు. ఉత్సాహంగా కనిపించారని చిరంజీవి చెప్పుకొచ్చారు.

కోలుకుంటున్న దాసరి

కోలుకుంటున్న దాసరి

ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న దాసరి దర్శకరత్న దాసరి నారాయణరావు ఇటీవల అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నారు. గురువారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా దాసరి నివాసం సినీ ప్రముఖులతో కిటకిటలాడింది.

అనారోగ్యంపై దాసరి స్పందన

అనారోగ్యంపై దాసరి స్పందన

తాను గొంతు తెరిచి నాలుగు మాసాలు అయిందని, గొంతు సరిగా లేదని, పది రోజుల క్రితమే గొంతు వచ్చిందని దాసరి నారాయణరావు అన్నారు. మీడియా మాట్లాడమని చాలా రోజుల నుంచి అడుగుతున్నా ఇప్పుడే వద్దని, నెల రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతానని చెప్పానని అన్నారు.

పురస్కారంపై

పురస్కారంపై

ఈ సమయంలో అల్లు పురస్కారం తాను ఊహించలేదని, ఈ అవార్డును వేదికపై తీసుకోవాల్సిందని, కానీ, అనారోగ్యం కారణంగా కుదరలేదన్నారు. ఆ అవార్డును తన తరపున చిరంజీవి అందుకుని, ఈ రోజున, తన పుట్టిన రోజు సందర్భంగా దీనిని తనకు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. జీవితంలో ఎన్నో రకాల అవార్డులు పొందానని, కానీ, ఈ అవార్డుకు ఓ ప్రత్యేక ఉందని అన్నారు. ఎందుకంటే, ఈ అవార్డు తన సొంత మనుషులు ఇచ్చే అవార్డని అన్నారు దాసరి.

ఆయనకు ఆల్టర్ నేటివ్ లేదు

ఆయనకు ఆల్టర్ నేటివ్ లేదు

అల్లు రామలింగయ్యకు, తనకు ఉన్న అనుబంధం అందరికీ తెలుసని, దాదాపు తాను తీసిన అన్ని సినిమాల్లోను నటించిన నటుడు అల్లు రామలింగయ్య అని, ఆయనకు ఆల్టర్ నేటివ్ లేదని దాసరి ప్రశంసించారు.

English summary
Dasari Narayana Rao Awarded with Allu Ramalingaiah Award 2017. Megastar Chiranjeevi presants this awrds to Dasari.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu