»   » అడవిలో దొరికిందే విడుదల చేస్తున్నాం..ఇదిగో ఫస్ట్ లుక్

అడవిలో దొరికిందే విడుదల చేస్తున్నాం..ఇదిగో ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:నాలుగేళ్ల కిత్రం ఆరుగురు స్నేహితులు సరదాగా ట్రక్కింగ్‌ చేయడానికి మంగుళూరుకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ అడవిలోకి వెళ్లి, ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అప్పుడు వాళ్లు తీసుకెళ్లిన కెమెరా 2012లో దొరికింది. అందులోని విజువల్స్‌ చూస్తే వాళ్లు ఏవిధంగా కనిపించకుండా పోయారో వెల్లడయింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇప్పుడు ఆ విజువల్స్‌ని సినిమా రూపంలో ఎడిట్‌ చేసి, అటవీశాఖ అనుమతితో ప్రేక్షకులముందుకు తెస్తోంది గుడ్‌ సినిమా గ్రూప్‌ సంస్థ. శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్‌తో కలసి నిర్మించిన ఈ డిఫరెంట్‌ సినిమాకు ‘చిత్రమ్‌ కాదు నిజమ్‌' అని పేరు పెట్టారు. రమేశ్‌ ఈ పుటేజ్‌ని షూట్‌ చేశారు. ప్రస్తుతం ఫైనల్‌ మిక్సింగ్‌ జరుగుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...

2010లో ఆరుగురు ఫ్రెండ్స్‌ సరదాగా ట్రక్కింగ్‌ చేయడానికి మంగుళూరు కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ అడవిలోకి వెళ్లి, కనిపించకుండా పోయారు. అప్పుడు వాళ్లు తీసుకెళ్లిన కెమెరా 2012లో దొరకగా అందులోని విజువల్స్‌లో వాళ్లు ఏ విధంగా కనపడకుండా పోయారో తెలిసింది. ఇప్పుడు ఆ విజువల్స్‌ని సినిమా రూపంలో ఎడిటింగ్‌ చేసి, యథావిధిగా, అటవీశాఖ అనుమతితో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది వినడానికి వింతగా ఉన్నా...చిత్ర పరిశ్రమలోనే ఓ అరుదైన రికార్డుగా నిలుస్తుంది. ఈ డిఫరెంట్‌ సినిమాకు 'చిత్రమ్‌ కాదు నిజమ్‌' అనే టైటిల్‌ పెట్టారు.

Chitram Kaadu Nijam Release Date Poster

ఈరోజుల్లో, రొమాన్స్‌, విల్లా, భద్రమ్‌ వంటి వైవిధ్యమైన చిత్రాల్ని అందించిన గుడ్‌ సినిమా గ్రూప్‌, శ్రీ శైలేంధ్ర ప్రొడక్షన్స్‌ తో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం ఫైనల్‌ మిక్సింగ్‌ చేస్తున్నారు.

నిర్మాతలు గుడ్‌ఫ్రెండ్స్‌ మాట్లాడుతూ ''ఓ అరుదైన సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమిది. మంగుళూరుకు సమీపంలోని ఫారెస్ట్‌ లో ఆరుగురు ఫ్రెండ్స్‌ కనిపించకుండా పోయిన సంఘటనల సమాహారమే చిత్రమ్‌ కాదు నిజమ్‌. వాళ్లు కనిపించకుండా పోయినా...వారికి సంబంధించిన కెమెరా ఒకటి దొరికింది. అందులోని విజువల్స్‌ను అటవీశాఖ అనుమతి తీసుకొని ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ తో కలిసి రిలీజ్‌ చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు చేస్తున్నాం. '' అని అన్నారు.

అలాగే...‘ ఓ అరుదైన సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమిది. మంగుళూరుకు సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లిన ఆరుగురు స్నేహితులు కనిపించకుండా పోయిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. అటవీశాఖ అనుమతితో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం ' అని తెలిపారు.

English summary
Good Cinema Group is back with one more intresting Movie "Chitram Kaadu Nijam". On this Colorful Eve of Holi, Presenting you the First Look design of Chitram Kaadu Nijam.
Please Wait while comments are loading...