»   » రామ్ చరణ్ తో రచ్చ చేయనున్న‘కలర్స్ స్వాతి’..!

రామ్ చరణ్ తో రచ్చ చేయనున్న‘కలర్స్ స్వాతి’..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించినప్పటికీ, కథానాయికగా మాత్రం ఇంకా అవకాశాలు పొందలేకపోతోంది. 'క్యారెక్టర్ ఆర్టిస్టుకి ఎక్కువ… హీరోయిన్ కి తక్కువ" అన్నట్టుగా వుంది ఆమె పరిస్థితి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా త్వరలో సెట్స్ ఫై కి వెళుతున్న చిత్రం 'రచ్చ'. ఈ చిత్రం లో కలర్స్ స్వాతి ఒక ప్రత్యేకమైన పాత్రలో మెరవనుందని సమాచారం. 'రచ్చ' దర్శకుడు సంపత్ నంది ఓ ముఖ్య మైన పాత్రలో స్వాతి ని నటింపచేయటమే కాకుండా ఆమె చేత ఓ పాట కూడా పాడిస్తున్నాడు అని తెలుస్తుంది. ఈ సినిమా జూన్ 12 నుండి సెట్స్ ఫై కి వెళ్ళనుంది.

పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాను ఒకే ఒక షెడ్యూల్ లో పూర్తిచేయనున్నట్లు సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ' సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.

English summary
Swathi, who proved as an actress and also tasted commercial success with Asta Chemma, turned into a singer for ’100% love’ movie. Now she also bagged a key role in Ram Charan’s next movie Rachcha which will go on floors from next week.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu