Don't Miss!
- News
తెలంగాణా బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ ప్రసంగంపై అందరిలోనూ ఉత్కంఠ!!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆయన దుర్మార్గుడు: వేణుమాధవ్ చివరి ప్రసంగం.. కన్నీళ్లు పెట్టించడం ఖాయం
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌కు సంబంధించిన ఓ సమావేశానికి ఇటీవల హాజరైన వేణు మాధవ్‌కు చివరి ఉపన్యాసంగా పేర్కొంటూ ఓ వీడియో వైరల్ అయింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. గత కొద్దికాలంగా అనారోగ్యానికి గురైన వేణు మాధవ్ బుధవారం మరణించిన సంగతి తెలిసిందే. గురువారం కన్నీటితో వీడ్కోలు పలుకుతూ కుటుంబ సభ్యులు దహన సంస్కరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన చివరి స్పీచ్‌లో ఏమన్నారంటే..

వీడియో ప్రసంగంలో
ట్రెండింగ్ వీడియోలో దీక్షితులు మాస్టారు, కోడి రామకృష్ణ, ఈ మధ్య చాలా మంది మనల్ని విడిచిపోయారు. వారు లేని లోటు మనకు తీర్చలేనిది. ఈ సమావేశంలో వారి గురించి మాట్లాడకపోతే ఈ మీటింగ్‌కు సార్థకత ఉండదు. వారికి నివాళి అర్పించడం చాలా అవసరం అని వేణు మాధవ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

శివాజీ రాజా గురించి మాట్లాడుతూ..
శివాజీ రాజా గురించి మాట్లాడుతూ.. దుర్మార్గుడు, మంచివాడు కాదు. ఆయనంత చెడ్డవాడు ఉండడు. ఎందుకంటే ఆయన దృష్టికి ఏదైనా విషయం వస్తే దానిని పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రవర్తిస్తాడు. వెంటనే ఆ పని జరిగిపోవాలి.. ఎవరిని పట్టుకొంటే అయిపోతుంది అని తీవ్రంగా ఆలోచించే దుర్మార్గుడు. ఆ మొండితనమే ఆయనను ఆస్థాయికి తీసుకెళ్లింది అని వేణు మాధవ్ అన్నారు.
Recommended Video

ఆయన స్వభావమే అలా..
సినీ పరిశ్రమలో అందరినీ పట్టించుకొనే స్వభావం శివాజీరాజాది. చిన్న, పెద్ద ఆర్టిస్టులను పట్టించుకొంటాడు. జర్నలిస్టులను, అన్ని వర్గాలను కలుపుకుపోతాడు. ఆయన వందేళ్లు సుఖంగా జీవించాలి. ఆయనకు ఓ ప్రమాదం జరిగితే.. భగవంతుడు పునర్జన్మను ప్రసాదించాడు. భగవంతుడు పెట్టిన భిక్షను ఎలా సద్వినియోగం చేసుకోవాలని ఆలోచిస్తాడు అని వేణు మాధవ్ అన్నారు.

పేద ఆర్టిస్టుల గురించే
ఎప్పుడూ పేద ఆర్టిస్టుల వారి గురించి ఆలోచిస్తాడు. విలాసంగా ఏదైనా తిందామంటే.. ఎందుకురా అంటాడు. ఆ ఖర్చు తగ్గిస్తే మిగిలే సొమ్ముతో పేదవాడికి కుటుంబం పూట గడుస్తుంది. మనం తినకపోయినా పర్వాలేదని అంటాడు. అలాంటి దుర్మార్గుడు శివాజీ రాజా అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు.

చిరకాలం సేవలోనే
ఇక మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఉన్నంత కాలం ప్రతీ ఆర్టిస్టుకు మేము సేవ చేస్తాం. ప్రతీ ఒక్కరిని ఆదుకొంటాం. అందులో ఎలాంటి రాజీ లేదు. శివాజీ రాజాను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఉత్తేజ్‌కు ధన్యవాదాలు అంటూ స్పీచ్ ముగించారు. ఈ స్పీచే ఆయన చివరి ప్రసంగమని సినీ వర్గాలు అంటున్నాయి.