»   » మౌనం వీడనున్న పవన్ కళ్యాణ్ : త్వరలో మీడియా ముందుకు..!

మౌనం వీడనున్న పవన్ కళ్యాణ్ : త్వరలో మీడియా ముందుకు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అధికారం కోసం కాదు, ప్రశ్నించడానికే అంటూ 'జనసేన' పార్టీని స్థాపించి ఎన్నికల ముందు ఊకదంపుడు ప్రసంగాలు దంచిన పవన్ కళ్యాణ్.....ధరలు పెరుగిగి సామాన్యుడి నడ్డి విరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వాలను ఎందుకు ప్రశ్నించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు కాస్త అసంతృప్తిగానే ఉన్నారు.

ఆ విమర్శలతో బయట తలెత్తుకు తిరగలేని పరిస్థితిలో ఫ్యాన్స్‌కు త్వరలో ఉపశమనం కలుగనుంది. త్వరలో పవన్ కళ్యాణ్ మౌనం వీడి మీడియా ముందుకు రాబోతున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ నుండి సందేశం అందింది. ఇంతకాలం మౌనంగా ఉండటానికి కారణం 'జనసేన' పార్టీకి ఇంకా అధికారిక గుర్తింపు దక్కకక పోవడమే అని పవన్ అంటున్నారు.

ఎన్నికల కమీషన్ నుండి 'జనసేన' పార్టీకి గుర్తింపు రాగానే మీడియా ముందుకు వస్తానని, అన్ని విషయాలు మాట్లాడతానని, పార్టీని బలోపేతం చేయడంపై, విస్తరించడంపై దృష్టి పెడతానని పవన్ కళ్యాణ్ అంటున్నారని తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో వార్తలొస్తున్నాయి.

Coming Soon:Pawan Kalyan Press meet

రాష్ట్ర రాజధాని కోసం తాను నిధులు సేకరించాలని ఎవరితోనూ చెప్పలేదని, ఎవరైనా తన పేరుతో అలా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే...
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'గోపాలా గోపాలా' సినిమా షూటింగుతో బిజీగా గడుపుతున్నారు. వెంకటేష్, పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న 'గోపాలా గోపాలా' చిత్రం షూటింగ్ వేగం పుంజుకుంది. ఈచిత్రాన్ని అక్టోబర్ 23న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని 'సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

వెంకీ సరసన 'శ్రియ' నటిస్తుండగా ప్రధాన పాత్రలలో..మిదున్ చక్రవర్తి, పోసాని కృష్ణ మురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్, పృథ్వి, దీక్షా పంత్, నర్రా శీను, రమేష్ గోపి, అంజు అస్రాని నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియ, ఉమేష్ శుక్ల, స్క్రీన్ ప్లే: కిషోర్ కుమార్ పార్ధసాని, భూపతి రాజా, దీపక్ రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు : సాయి మాధవ్, సంగీతం : అనూప్ రూబెన్స్, పాటలు : చంద్ర బోస్, ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, కొరియో గ్రఫీ : సుచిత్ర చంద్రబోస్, కో డైరెక్టర్స్ : పూసల రాధాకృష్ణ, వై.శ్రీనివాస రెడ్డి, ప్రొడక్షన్ ఎగ్జి క్యుటివ్స్ : వీరేన్ తంబి దొరై, భాస్కర రాజు, అభిరామ్, దర్శకత్వం: డాలి. హిందీలో సూపర్ హిట్ అయిన 'ఓ మై గాడ్' చిత్రానికి రీమేకే ఈచిత్రం.

English summary
According to latest reports, Pawan Kalyan was will address a press conference shortly.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu