»   » ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సెన్సార్ పూర్తయింది

‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సెన్సార్ పూర్తయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నితిన్‌, యామీ గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో, గురుఫిల్మ్‌‌స, మల్టీడైమెన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ సమర్పకుడిగా , ప్రేమ్‌ సాయి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సెప్టెంబర్‌ 17న ఈ చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా ఈ చిత్రం U/A సర్టిఫికెట్ పొందింది.

రొమాన్స్‌, యాక్షన్‌, కామెడి, థ్రిల్లర్‌ అంశాలు మేళవించిన చిత్ర మిది. సాధారాణ కొరియర్‌ బాయ్‌గా పని చేసే ఒక యువకుడి జీవితంలో ఎదురైన అనుహ్య సంఘటనలు, వాటి పరిణామాలేమిటి? సవాళ్లను అధిగమించే క్రమంలో అతడు ఎలాంటి పోరాటాన్ని సాగించాడు? అన్నదే చిత్ర ఇతివృతం.

Courier Boy Kalyan

అశుతోష్ రాణా, నాజర్, సత్యం రాజేష్, సప్తగిరి, హర్ష వర్ణన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, అనూప్ రూబెన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్: సందీప్ చౌతా, సినిమాటోగ్రఫీ: సత్య పొన్ మార్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: రాజీవన్, యాక్షన్: విజయ్, దిలీప్ సుబ్బరాయన్, సాహిత్యం: అనంత శ్రీరామ్, భాస్కరభట్ల, సాహితి, శ్రేష్ఠ, కొరియోగ్రాఫర్: శేఖర్, విష్ణు దేవా, రచనా సహకారం: కోన వెంకట్, హర్ష వర్ధన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: స్వాతి రఘురామన్, విజయ్ శంకర్.

English summary
Courier Boy Kalyan is censored today and obtained U/A certificate with no cuts.
Please Wait while comments are loading...