twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చర్చలకు రాని ఫైటర్స్ యూనియన్..సురేష్ బాబు స్పందన

    By Srikanya
    |

    నిన్న(గురువారం) ఫైటర్ల వివాదంతో ఆంధ్రప్రదేశ్ లోని షూటింగ్ లన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై నిర్మాతల మండలి ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు డి.సురేష్‌ బాబు ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. అయితే ఎ.పి.ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు మాత్రం చర్చలకు రాలేదు. 'మాకు చాలా సమస్యలున్నాయి. వాటన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే చర్చలకు వస్తామ'ని నిర్మాతల మండలికి వారుఫ్యాక్స్‌ చేశారు. దీంతో మరో దఫా సమావేశమై చర్చలు జరపాలని నిర్మాతల మండలి నిర్ణయించింది.

    ఈ సందర్భంగా డి.సురేష్ ‌బాబు మాట్లాడుతూ "సమస్య పరిష్కారం కోసం నిర్మాతలమంతా కలిసి చర్చలు జరిపాం. ఫెడరేషన్‌ ప్రతినిధులను కూడా ఆహ్వానించాం. వారి నుంచి సరైన స్పందన రాలేదు. సమస్యలు పరిష్కారం కావాలంటే చర్చలే మార్గం. అందరూ కలిసి కూర్చొని మాట్లాడితేనే ఏదైనా సాధ్యమవుతుంది..తరవాత ఏం చేయాలనే విషయంపై మరోసారి చర్చిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నిర్మాతలు అల్లు అరవింద్‌, శ్యామ్ ‌ప్రసాద్ ‌రెడ్డి, దిల్ ‌రాజు, తేజ, సి.కల్యాణ్‌, కె.ఎల్‌.నారాయణ, నల్లమలుపు బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

    ఇక సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఛార్మినార్ వద్ద చిత్రీకరిస్తున్న కందిరీగ సినిమా షూటింగ్ లో చెన్నై, ఆంధ్రా ఫైటర్ల మధ్య బుధవారం ఈ ఘర్షణ చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్దంగా స్ధానికేతరులకే సినిమాలో ఎక్కువ ప్రాముఖ్యత కల్పించారని ఆరోపిస్తూ స్ధానికంగా ఉన్న పలువురు సినీ ఫైటర్లు చెన్నై ఫైట్ మాస్టర్లపై దాడి చేయటంతో ఇరు వర్గాల మధ్య ఘర్ణణ జరిగింది. దీంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ ఘటనను నిరసిస్తూ గురువారం తెలుగు సినిమా షూటింగ్ లన్నీ రద్దు చేస్తున్నట్లు సినిమా నిర్మాతల మండలి ప్రకటించి అమలు చేసింది. అందుకే చర్చలు జరిపారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X