»   » జూలై 21న దండుపాళ్యం-2

జూలై 21న దండుపాళ్యం-2

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెంకట్‌ మూవీస్‌ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత వెంకట్‌ నిర్మించిన 'దండుపాళ్య' కన్నడలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీగా 30 కోట్లు కలెక్ట్‌ చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. 'దండుపాళ్యం' పేరుతో తెలుగులో విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌ అయి 10 కోట్లు కలెక్ట్‌ చెయ్యడమే కాకుండా శతదినోత్సవం జరుపుకొని సంచలనం సృష్టించింది. తెలుగు, కన్నడ భాషల్లో ఇంతటి ఘనవిజయం సాధించిన 'దండుపాళ్యం' టీమ్‌తోనే ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'దండుపాళ్యం-2' చిత్రాన్ని నిర్మాత వెంకట్‌ చాలా భారీ ఎత్తున నిర్మించిన విషయం తెలిసిందే.

"దండుపాళ్యం-2" జూలై 14న కన్నడలో విడుదలై భారీ ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రం తెలుగులో జూలై 21న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ - ''తెలుగు, కన్నడ భాషల్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన 'దండుపాళ్యం' చిత్రానికి సీక్వెల్‌గా మా బేనర్‌లో నిర్మించిన 'దండుపాళ్యం-2' జూలై 14న కన్నడలో విడుదలైంది. ఈ సీక్వెల్‌గా ఆడియన్స్‌ నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. అన్ని ఏరియాల్లోనూ యునానిమస్‌గా సూపర్‌హిట్‌ టాక్‌ వస్తోంది. 'దండుపాళ్యం2' చిత్రాన్ని తెలుగులో జూలై 21న విడుదల చేస్తున్నాం. కన్నడలో సూపర్‌హిట్‌ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్‌ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌ వుంది'' అన్నారు.

Dandupalyam 2 on this july 21

దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ - ''శుక్రవారం కన్నడలో విడుదలైన దండుపాళ్యం2 చిత్రానికి ఇంత మంచి రెస్పాన్స్‌ రావడం చాలా హ్యాపీగా వుంది. జూలై 21న విడుదలవుతున్న తెలుగు వెర్షన్‌కి అంతకు మించిన రెస్పాన్స్‌ వస్తుందన్న నమ్మకం నాకు వుంది. 'దండుపాళ్యం3' కూడా ఫినిషింగ్‌ స్టేజ్‌లో వుంది. త్వరలోనే పార్ట్‌ 3 కూడా విడుదలవుతుంది'' అన్నారు. బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవి కాలె, పెట్రోల్‌ ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్‌, కరి సుబ్బు, కోటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌, సంగీతం: అర్జున్‌ జన్య, కో-డైరెక్టర్‌: రమేష్‌ చెంబేటి, నిర్మాణం: వెంకట్‌ మూవీస్‌, నిర్మాత: వెంకట్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరాజు.

English summary
Dandupalyam 2 Telugu version will be realeased on this july 21
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu