»   » క్లబ్బులకు వెళ్ళటం తెలుసు..నటన తెలుయదు: దాసరి విసుర్లు

క్లబ్బులకు వెళ్ళటం తెలుసు..నటన తెలుయదు: దాసరి విసుర్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు తాజాగా మరో సారి హీరోయిన్స్ పై విరుచుకుపడ్డారు. వంశీ ఇంటర్నేషనల్ సంస్త ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమానికి ఆయన హాజరై హీరోయిన్ల బిహేవియర్ ని విమర్శించారు. హీరోయిన్లకు అసలు ఏమి తెలియదుని, వారికి డబ్బులు తీసుకుని షాపులు ఓపెనింగులకు వెళ్ళడం తెలుసు, క్లబ్లులకు, పబ్బులకు వెళ్లడం తెలుసు. నటన వారికి తెలియదు. వారికి అవార్డు ఉత్సవాలకు మాత్రం రారు.మనమీద గౌరవం లేదు. మన సంస్థల మీద గౌరవం లేదు. మనం ఇచ్చే అవార్డులకు గౌరవం లేదు. వారిని దయచేసి పిలవకండి అని హీరోయిన్లపై దారుణంగా మాట్లాడారు. ఆ కార్యక్రమానికి ఎవరైనా హీరోయిన్ రాలేదో, మరేదైనా కోపమో అని అంతా గుసగుస లాడుకున్నారు.దాంతో దాసరి చేసిన ఈ వ్యాఖ్యలకు హీరోయిన్లు ఎలా స్పందిస్తారో లేదా భయపడి మెదలకుండా ఉంటారో చూడాలంటున్నారు.ఇక రీసెంట్ గా దాసరి నారాయణరావు ..తాప్సీకి ఓ పూల బొకే పంపి మిస్టర్ ఫెరఫెక్ట్ లో ఫెరఫెక్ట్ గా చేసావంటూ మెచ్చుకున్నారు. అంతలోనే ఇంత కోపం తెచ్చుకున్నారు.

English summary
Director Dasari Narayana Rao has sent a flower bouquet to her as a token of appreciation. “A special bouquet of appreciation from dasari sir for my efforts to dub in mr perfect n fr d success of d movie. Overwhelmed! Thanq sir!” Tapsi twitted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu