»   » మేము రావడం దండగ: బన్నీ ఫ్యాన్స్‌పై దాసరి ఫైర్!

మేము రావడం దండగ: బన్నీ ఫ్యాన్స్‌పై దాసరి ఫైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘S/O సత్యమూర్తి' చిత్రానికి సంబంధించిన ఆడియో ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు దర్శక రత్న దాసరి నారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చేతికి మైకు దొరికితే చాలు ప్రసంగాలు దంచేసే దాసరి ఈ ఆడియో వేడుకలోనూ తనదైన రీతిలో ప్రసంగించారు. అయితే దాసరి ప్రసంగిస్తుండగా బన్నీ ఫ్యాన్స్ ఆయన్ను ఇబ్బందికి గురి చేసారు. దీంతో దాసరి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

దాసరి మాట్లాడుతుండగా కొందరు అభిమానులు గోల చేయడం మొదలు పెట్టారు. దీంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. ఇలాంటి ఆడియో వేడుకల్లో మీ అభిమానం ప్రదర్శించడానికి ఆసక్తి చూపుతున్నారే తప్ప....మాలాంటి పెద్దల మాటలు వినే ఓపిక మీకు లేదు. ఇలాంటి అయితే మా బోటి వారు రావడం దండగ అంటూ ఫైర్ అయ్యారు.

దాసరి ప్రసంగానికి ఫ్యాన్స్ అంతలా అడ్డు పడుతూ గోల చేస్తున్నా....హీరో అల్లు అర్జున్ కానీ, ఇతరలుకానీ కనీసం అభిమానులను వారించే ప్రయత్నం చేయక పోవడం గమనార్హం. దీంతో దాసరి కాస్త హర్టయినట్లు కనిపించారు. దాసరి లాంటి పెద్దలకు గౌరవం ఇవ్వక పోవడం చర్చనీయాంశం అయింది.

Dasari Narayana Rao fired on Bunny Fans At S/o Satyamurthy Audio Launch

దాసరి ఇంకా మాట్లాడుతూ - ''అల్లు రామలింగయ్యగారంటే నాకెంతో అభిమానం. నా చేతుల మీదగా ప్రారంభమైన అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సంస్థకు రెండు ఘనవిజయాలు ఇచ్చాను. అల్లు అర్జున్ ఇవాళ ఎవరూ ఊహించని స్థాయిలో నిలబడ్డాడు. 'అత్తారింటికి దారేది' విజయం తర్వాత త్రివిక్రమ్, 'రేసు గుర్రం' విజయం తర్వాత అల్లు అర్జున్ చేసిన ఈ చిత్రం ఆ రెండు చిత్రాలకు దీటుగా ఉంటుందనిపిస్తోంది. ప్రచార చిత్రాలు, పాటలు బాగున్నాయి'' అన్నారు.

అల్లు అర్జున్, సమంత, అదా శర్మ, నిత్యామీనన్ కాంబినేషన్‌లో ఎస్. రాధాకృష్ణ నిర్మించిన చిత్రం 'సన్నాఫ్ సత్యమూర్తి'. డా. రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర, స్నేహ కీలక పాత్రలు చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ పాటలు స్వరపరిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసరి సీడీని ఆవిష్కరించి అల్లు అరవింద్‌కి ఇచ్చారు.

English summary
Dasari Narayana Rao fired on Bunny Fans At S/o Satyamurthy Audio Launch.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu