»   » అంత బలహీనురాల్ని కాదు:దీక్షాసేధ్

అంత బలహీనురాల్ని కాదు:దీక్షాసేధ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అభినందనలు వచ్చినప్పుడు పొంగిపోయి విమర్శలు వచ్చినప్పుడు కుంగిపోయేంత బలహీనురాల్ని కాదు అంటోంది దీక్షాసేధ్.వేదం చిత్రం తో పరిచయమైన ఈ ముద్దగుమ్మ తర్వాత మిరపకాయ,వాంటెడ్ చిత్రాలు చేసింది.అలాగే తమిళనాట కూడా ఆమె విక్రమ్,శింబు వంటి స్టార్స్ సరసన చేస్తోంది.ఆమె సినీ పరిశ్రమపై తన అభిప్రాయం చెపుతూ ఇలా స్పందించింది.అలాగే ఏ రంగంలో అయినా మంచి, చెడు రెండూ ఉంటాయి అని క్లారిఫై చేస్తోంది.

రూమర్స్ గురించి మాట్లాడుతూ...నా గురించిన అన్ని విషయాలు మావాళ్లకు తెలుసు. మా మధ్య దాపరికాలు ఉండవు. అందుకని నా గురించి వచ్చే వార్తలను మావాళ్లు నమ్మరు. కాబట్టి రూమర్స్ కి నేను భయపడను. నటిగా నా సత్తా నిరూపించుకోవాలనే లక్ష్యంతో ఇక్కడికొచ్చాను. అది నెరవేర్చుకునే దిశలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయను అని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఆమె తమిళంలో విక్రమ్ సరసన 'రాజబాట్టయ్", శింబుతో 'వేట్టయ్‌మన్నన్" చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu