»   » 16 కోట్లు పెట్టి నూతన సంవత్సర కానుకగా ప్లాట్ కోన్న సోట్టబుగ్గల సుందరి

16 కోట్లు పెట్టి నూతన సంవత్సర కానుకగా ప్లాట్ కోన్న సోట్టబుగ్గల సుందరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్యూమాండ్ టవర్స్ సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకొనే ప్లాట్ నుకోనుగోలు చేశారు. ముంబయ్‌లోని ప్రభాదేవిలోగల ఈ టవర్స్‌లో ఆమె ఇటీవల ఓ ఫ్లాట్ సొంతం చేసుకున్నారు. 33 అంతస్తులు గల ఈ టవర్స్‌లో దీపికా ఫ్లాట్ ఉన్నది 26వ అంతస్తులో. ఆమె కొన్న ఫ్లాట్ ఖరీదు 16 కోట్ల రూపాయలు. దాన్నిబట్టే బ్యూమాండ్ టవర్స్‌లోని ఫ్లాట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. దీపికా కొన్నది నాలుగు పడక గదులు గల ఫ్లాట్ అట. అలాగే ఆమెకి మూడు కారు పార్కింగులు కేటాయించారట. ఈ ఫ్లాట్ ఇంటీరియర్ డిజైన్ చూస్తే మరో లోకంలో విహరించడం ఖాయం అని చూసినవాళ్లు అంటున్నారు.

ముంబయ్‌లోని ప్రముఖ సిద్ధివినాయక ఆలయానికి సమీపంలో ఈ టవర్స్ ఉన్నాయి. ఆ ఏరియాకి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు 16 కోట్లు పెట్టి దీపికా కొన్న ఫ్లాట్ భవిష్యత్‌లో 30 కోట్లకు అమ్ముడుపోయినా ఆశ్చర్యపోవడానికి లేదని ఆ ఏరియా గురించి తెలిసినవాళ్లు అంటున్నారు. మొత్తం మీద ఆమెను 'బ్యూటీ విత్ బ్రెయిన్" అని ప్రశంసిస్తున్నారు కూడా. దీపికా చాలా తెలివిగా పెట్టుబడులు ప్లాన్ చేస్తున్నారనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇటీవల ఈ ఫ్లాట్‌ని తన తండ్రి ప్రకాష్ పదుకొనే, తన పేరు మీద జాయింట్‌గా రిజిస్టర్ చేయించారట దీపికా.

మరి గృహప్రవేశం ఎప్పుడు? అని బాలీవుడ్ వర్గాలు దీపికాని అడుగుతున్నాయ్. త్వరలో ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలనుకుంటున్నారు ఆమె. కాకపోతే ఈ ఫ్లాట్‌ని 'అతిథి గృహం"లా మాత్రమే వాడుకోవాలన్నది దీపికా ఆలోచన. ప్రస్తుతం ముంబయ్‌లోని బాంద్రాలో గల పాలీ హిల్ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్నారు. ఇక ముందు కూడా అక్కడే ఉంటారట. ఆ అపార్ట్‌మెంట్ తనకి కలిసి రావడంవల్లే అక్కడే ఉండాలని దీపికా అనుకుంటున్నారట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu