Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రజనీకాంత్ ముంచారంటోంది
ముంబై: రజనీకాంత్ జోడీగా ఆ సినిమా చేసినందుకు గర్వపడుతున్నా అంటూ చెప్పిన దీపికా పదుకోని ఇప్పుడు కారాలు మిరియాలు నూరుతోందిట. సౌత్ సినిమా అంటే నే చిరాకుపడుతోందని సమాచారం. 'కొచ్చాడయాన్' లో తన పాత్రను సరిగ్గా డిజైన్ చేయలేదని అంటోంది. అందుకే ఆమె అలిగి ప్రమోషన్ ఏక్టివిటీస్ కి సైతం హాజరు కాలేదట. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నాను అని ఫీల్ అయిన ఆమెకు ఆ చిత్రం అవుట్ పుట్ సంతోషాన్ని ఇవ్వలేదుట. దానికి తోడు సినిమా ఫ్లాపు అవటం కూడా ఆమెను నిరాశలో ముంచింది అంటున్నారు.
దీపికా మాట్లాడుతూ... "ఈ మధ్య వరుసగా నాలుగు సినిమాలు - 'కాక్‌టైల్', 'రేస్ 2', 'యే జవానీ హై దీవానీ', 'చెన్నై ఎక్స్‌ప్రెస్' - బాగా ఆడాయి. నేను సినిమాలను ఎంపిక చేసుకోవడం కాదు కానీ, సినిమాలే నన్ను ఎంపిక చేసుకుంటున్నాయి అని భావిస్తున్నా. ఇప్పటివరకూ నేను చేసిన వాటిలో 'రామ్‌లీల'లో చేసిందే ఎక్కువ ఛాలెంజింగ్ రోల్. శారీరకంగా, భావోద్వేగపరంగా డ్రీమింగ్ రోల్. ఈ సినిమా చేయడమనేది నాకు గ్రేట్ ఎక్స్‌పీరియన్స్.''అని చెప్పారు.

ఇక ఆమె మాట్లాడుతూ... ''ఒక నటిగా ఏదో ఒక భాషకు మాత్రమే పరిమితం కాను. మంచి కథ దొరికితే టాలీవుడ్.. శాండిల్‌వుడ్.. ఎక్కడైనా నటించడానికి సిద్ధమే'' అని చెప్పారు. ఇక హిందీ చిత్రం 'చెన్నై ఎక్స్‌ప్రెస్'లో లుంగీ కట్టుకోవడం గురించి చెబుతూ -''నేను పెరిగిందంతా బెంగళూరులోనే. అక్కడ తమిళులు ఎక్కువగా ఉండడంతో వాళ్ల వేషభాషలపై నాకు మంచి అవగాహన ఉంది. అందుకే లుంగీలో కనిపించడం అనేది పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు. కాకపోతే లుంగీలో నాకు నేనే చాలా డిఫరెంట్‌గా కనిపించా'' అన్నారు.
తెలుగు సినిమాల్లో ఎప్పుడు కనిపిస్తారు అంటే ... ''తెలుగులో నటించమని నన్ను ఇంతవరకు ఎవరూ అడగలేదు. అడిగితే తప్పకుండా చేస్తాను'' అని చెప్పింది. ''మోడలింగ్ చేసేటప్పుడు గతంలో చాలా సార్లు హైదరాబాద్ వచ్చాను. ఆహారం, సంప్రదాయాలు, వాతావరణం అన్నీ నా స్వస్థలం బెంగళూరులాగే ఉంటాయి'' అని చెప్పింది దీపిక.