»   » సురేంద్రరెడ్డికు కూడా తెలియకుండా రామ్ చరణ్ ..బాబాయ్ పవన్ పాటని...

సురేంద్రరెడ్డికు కూడా తెలియకుండా రామ్ చరణ్ ..బాబాయ్ పవన్ పాటని...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారీ అంచనాల మధ్యన గత శుక్రవారం 'ధృవ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన రామ్ చరణ్, మొదటి షో నుంచి హిట్ టాక్ సంపాదించుకొని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రోమాలు నిక్కపొడుచుకునే స్దాయిలో ఉంది ధ్రువ టైటిల్ సాంగ్. ఆ చిత్రం సాంగ్ ను థియేటర్లలో చూస్తున్న వారికి తెలియని ఏవో చిల్స్ ఒంటిని, మనస్సును తాకిన అనుభూతిని పొందుతున్నామంటున్నారు. ఈ పాటే సినిమాకు పెద్ద అసెట్.

అయితే..ఈ పాట సినిమాలో పెట్టడం వెనుక స్ఫూర్తి విషయమై రామ్ చరణ్ వివరణ ఇచ్చారు. ధ్రువ రిలీజ్ సమయంలో అమెరికా వెళ్లిన చెర్రీ అక్కడ ఫ్యాన్స్ తో కలసి సినిమాను వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ...ఈ విషయాలు వివరించారు.


Dhruva’s title song inspired by Pawan Kalyan’s Travelling Soldier: Charan

రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఈ చిత్రం టైటిల్ సాంగ్ ను పెట్టడం వెనుక బాబాయ్ పవన్ కళ్యాణ్ తమ్ముడు చిత్రంలోని ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ ఇన్స్పిరేషన్ అని చెప్పారు. ఈ పాట పెడుతున్నట్లు దర్శకుడు సురేందర్ రెడ్డి కి కూడా తెలియదని చెప్పారు రామ్ చరణ్.


ఆ మాటలు మెగాఫ్యాన్స్ ను ఆనందాన్నిచ్చాయి. ఇక చెర్రీ మాటలు విన్న పవన్ ఫ్యాన్స్ అయితే హర్షద్వానాలతో హోరెత్తించారు. ఇక తమ్ముడు లోని ట్రావెలింగ్ సోల్జర్ ఇప్పటికీ యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమైన పాటగా నిలవడం పవన్ ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తోంది.


కాగా కరన్సీ బ్యాన్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్స్ ఊహించిన స్థాయిలో అయితే లేవు. బీ,సీ సెంటర్లలో కాస్త కరన్సీ బ్యాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. అయినప్పటికీ ముందు ముందు కలెక్షన్స్ పుంజుకుంటాయని ట్రేడ్ భావిస్తోంది.

English summary
During his promotions in US, Charan revealed that Pawan Kalyan’s Travelling Soldier song is the inspiration behind the making of Dhruva title song.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu