»   » వారుసుల రాజ్యం ఏలుతున్న సినీ పరిశ్రమలోనికి మరో వారుసుడు..

వారుసుల రాజ్యం ఏలుతున్న సినీ పరిశ్రమలోనికి మరో వారుసుడు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

వారుసుల రాజ్యం ఏలుతున్న సినీ పరిశ్రమలోనికి మరో వారసుడు అరంగేట్రం చేయనున్నాడు..కాదు కాదు చేసేశాడు..ఇంతకీ ఎవరా వారసుడు అనుకుంటున్నారు..కాదా! మీరు అనుకుంటున్నట్లుగా మెగా ఫ్యామిలీ, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల నుండి మాత్రం కాదు..డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడు ..'ఆది".

ఆదిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న దర్శకుడు విజయభాస్కర్..చిత్రం పేరు 'ప్రేమ కావాలి". ఈ చిత్రం ప్రముఖ హీరోల సందడి మద్య లాంఛనంగా ప్రారంభమైంది..చిరంజీవి, బాలయ్య, నాగ్, కృష్ణంరాజు, కృష్ణ, హరికృష్ణ, జయసుధ, నాగేశ్వర రావు, రామానాయుడు, కె విశ్వనాథ్ మొదలగు వారంతా..'ఆది"ని ఆశీర్వదించడానికి ఈ చిత్ర ప్రారంబోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు..

ఓ తెలుగు కళామతల్లి..ముద్దుబిడ్డ తన బిడ్డను కూడా కళామతల్లి ఒడికి చేర్చుతున్నాడని..ఇది చాలా గర్వించదగ్గ విషయం అని..ఆదిని అందరూ ఆశీర్వదించి..మంచి హీరోగా నిలబెట్టాలని మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వదించారు. బాలయ్య, నాగ్ లు కూడా మంచి హీరోగా ఆది ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంటాడని..తొలి చిత్రమే మంచి విజయం సాధించి..ఆది..మంచి హీరోగా నిలదొక్కుకుంటాడని..ఆశీర్వదించారు..వీరితో పాటు కార్యక్రమానికి హాజరైన ప్రముఖులంతా ఆదిని ఆశీర్వదించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu