»   » దిల్ రాజు కొత్త చిత్రం ‘కేరింత’ (ఫస్ట్ లుక్)

దిల్ రాజు కొత్త చిత్రం ‘కేరింత’ (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కెరీర్లో చిన్న ,పెద్దా హీరో అంటూ తేడాలేకుండా సినిమాలు చేసిన దిల్ రాజు విజయవంతమైన నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. అదే కోవలో మరోసారి దిల్ రాజు ...ఎమ్ ఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా ఓ చిత్రం చేస్తున్నారు. ‘వినాయకుడు' ఫేం సాయి కిరణ్ అడవి డైరెక్ట్ చేస్తున్న ఈ ‘కేరింత' ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఆర్య,బొమ్మరిల్లు,కొత్త బంగారులోకం లా చిత్రం ఉంటుందని దిల్ రాజు చెప్తున్నారు. ఆ ఫస్ట్ లుక్ ఫొటోలని మీరూ చూడండి...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Dil Raju’s Kerintha's First Look

'వినాయకుడు' తో తానేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు సాయి కిరణ్ అడవి కొత్త చిత్రం 'కేరింత'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మై డ్రీం సినిమా బ్యానర్ ఫై దిల్ రాజు, సాయి కిరణ్ అడవి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మిక్కి జే మేయర్ ను అందిస్తున్నారు. ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కొత్తవాళ్లు నటిస్తున్నారు. ఇందుకోసం స్టార్ హంట్ నిర్వహించారు.

సాయికిరణ్‌ అడవి మాట్లాడుతూ... ''ఈ కథపై ఎప్పట్నుంచో కసరత్తులు జరిపాం. అబ్బూరి రవి మాతో కలవగానే కథ కొత్తరూపం సంతరించుకొంది'' అన్నారు. ఏప్రిల్‌ నుంచి షూటింగ్ ప్రారంభిస్తారు. ఎడిటర్ గా మధు, సినిమాటోగ్రాఫర్ గా విశ్వ, కొరియోగ్రాఫర్ గా విజయ్ ని ఈ మూవీతో పరిచయం చేస్తున్నారు.

Dil Raju’s Kerintha's First Look

''ఇదివరకు మా సంస్థలో చిన్న సినిమాల్ని తెరకెక్కించాం. కొంతకాలంగా స్టార్‌ హీరోల చిత్రాలకే పరిమితమయ్యాం. ఐదేళ్ల తర్వాత మళ్లీ 'కేరింత' పేరుతో ఓ చిన్న చిత్రాన్ని చేసాం'' అన్నారు దిల్‌రాజు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: విశ్వ, కూర్పు: మధు, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సహనిర్మాతలు: శిరీష్‌-లక్ష్మణ్‌.

English summary
Now Dil Raju busy with new film Kerinta which is being directed by Sai Kiran Adivi. Sumant Ashwin and tejaswi Madivala playing lead roles in the film .Mickey J Meyer will be composing the music and Abburi Ravi written dialogues for the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu