»   » సినిమావాళ్ళ భాషకి గోచీ లేదు: అర్జున్ రెడ్డి పైనేనా..?? దేవీప్రసాద్ వ్యాఖ్యలు

సినిమావాళ్ళ భాషకి గోచీ లేదు: అర్జున్ రెడ్డి పైనేనా..?? దేవీప్రసాద్ వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆర్నెల్ల కిందట రిలీజ్ చేసిన 'అర్జున్ రెడ్డి' టీజర్లో హీరో విజయ్ దేవరకొండ వాడిన పచ్చి బూతు.. టీజర్ చివర్లో వచ్చే లిప్ లాక్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. టీజర్లో మిగతా కంటెంట్ కూడా బాగున్నప్పటికీ అప్పుడా టీజర్ మీద ఎక్కువ చర్చ నడిచింది ఆ బూతు.. ఆ ముద్దు మీదే. టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూశాక.. ఆ తర్వాత కూడా సినిమాను ఇలాగే కాంట్రవర్శల్ వేలో అగ్రెసివ్‌గా ప్రమోట్ చేసే ప్రయత్నం చేసింది చిత్ర బృందం.

విజయ్ దేవరకొండ ప్రసంగం

విజయ్ దేవరకొండ ప్రసంగం

మొన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ ప్రసంగం ఎంతగా బూతు మయం అయిందో తెలిసిందే. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా పెద్ద ఎత్తున ‘అర్జున్ రెడ్డి' లిప్ లాక్ పోస్టర్లతో పబ్లిసిటీ చేస్తుండగా.. దీనిపై హైదరాబాద్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు గొడవ చేశారు.

Vijay Devarakonda Apologize to All For 'Dwaraka' Flop - Filmibeat Telugu
ప్రి రిలీజ్ ఈవెంట్లో

ప్రి రిలీజ్ ఈవెంట్లో

మరోవైపు కొన్ని సంఘాలు కూడా దీనిపై ఆందోళన మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం స్ట్రాటజిగ్గా అందరికీ సారీ చెప్పింది. ‘అర్జున్ రెడ్డి' ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఎవ్వరికీ ఏ విషయంలోనూ సారీ చెప్పేది లేదని.. ఎప్పుడు అగ్రెసివ్‌గా, కాన్ఫిడెంట్‌గానే ఉండాలని విజయ్ లెక్చర్లు దంచడం తెలిసిందే. అలాగే వీహెచ్‌ను ఉద్దేశించి అతను ‘తాతయ్యా.. చిల్' అంటూ వెటకారంగా మెసేజ్ కూడా పెట్టాడు.

లిప్ లాక్ పోస్టర్ల విషయంలో

లిప్ లాక్ పోస్టర్ల విషయంలో

లిప్ లాక్స్ తో ఉన్న ‘అర్జున్ రెడ్డి' పోస్టర్ల విషయంలో వ్యతిరేకత మరింత పెరగడం.. మహిళా సంఘాలు.. బీసీ యువజన సంఘం ‘అర్జున్ రెడ్డి' టీంకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం.. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘అర్జున్ రెడ్డి' టీం స్ట్రాటజిగ్గా సారీ చెప్పినట్లు కనిపిస్తోంది.

వివాదం వల్లే ఎక్కువ పబ్లిసిటీ

వివాదం వల్లే ఎక్కువ పబ్లిసిటీ

పోస్టర్ల కంటే కూడా ఈ వివాదం వల్లే ఎక్కువ పబ్లిసిటీ వస్తుందన్న ఉద్దేశంతో వాళ్లు సారీ చెప్పినట్లు భావిస్తున్నారు. సారీకే పరిమితం కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ లిప్ లాక్ పోస్టర్లన్నింటినీ కూడా తొలగించేస్తున్నట్లు ప్రకటించి చిత్ర బృందం. ఈ పోస్టర్ల చించివేత చర్చనీయాంశంగా మారి.. సినిమా పబ్లిసిటీకి బాగా కలిసొస్తుందని విజయ్ అండ్ టీం భావిస్తున్నట్లుగా ఉంది.

డైరెక్టర్ దేవీ ప్రసాద్

డైరెక్టర్ దేవీ ప్రసాద్

అయితే ఈ తరహా ప్రచారాన్ని ఏకి పారేశాడు టాలీవుడ్ డైరెక్టర్ దేవీ ప్రసాద్. ఆడుతూ పాడుతూ, లీలామహల్ సెంటర్, దట్ ఈజ్ పండు, బ్లేడ్ బాబ్జీ, మిస్టర్ పెళ్లికొడుకు, కెవ్వుకేక సినిమాల డైరెక్టర్ దేవీ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆడియో వేడుకలు, ప్రీరిలీజ్ ఈవెంట్లు లాంటి సినిమా ఫంక్షన్స్‌లో కొందరు సినిమా వాళ్లు వాడుతున్న భాష అసభ్యకరంగా ఉందని దేవీ ప్రసాద్ అభిప్రాయ పడ్డారు. డైరెక్ట్ గా పేరు ఎత్తలేదు గానీ దేవీ ప్రసాద్ ఎవర్ని ఉద్దేశించి అలా అన్నాడో అందరికీ అర్త్ఝమయ్యింది.

భాషకు గోచీ కూడా ఉండటం లేదు.

భాషకు గోచీ కూడా ఉండటం లేదు.

"ఎవడి బాత్‌రూంలో వాడు ఎలాగైనా స్నానం చేయొచ్చు. కానీ పబ్లిక్‌గా చెరువులో స్నానం చేసేప్పుడు గోచీ అయినా లేకపోతే బాగుండదు కదా. ఈ మధ్య ఫేస్‌బుక్ లోనేకాదు.. సినిమా ఫంక్షన్స్‌లోనూ కొందరు వాడుతున్న భాషకు గోచీ కూడా ఉండటం లేదు.'' అని దేవీ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పబ్లిక్ ఫంక్షన్ లో మద్ లాంటి మాటలు

పబ్లిక్ ఫంక్షన్ లో మద్ లాంటి మాటలు

ఎక్స్ప్రెషన్ అన్నది సినిమాలో ఎలా అయినా ఉండవచ్చు అలా అని శోభనం సీన్లో పోర్న్ క్లిప్ తరహా షాట్ తీస్తాం అంటే ఎలా ఉంటుందీ, లేదా సినిమా క్యారెక్టర్ని అనుసరించే మీరూ మాట్లాడండీ అంటూ ఒక పబ్లిక్ ఫంక్షన్ లో "మ******ద్ లాంటి మాటలు పలికిస్తే ఎలాఉంటుందీ..?? ఈ విషయాన్ని ఇప్పటికైనా విజయ్ దేవరకొండ గ్రహిస్తే బావుండేది...

English summary
Tollywood Director Deviprasad Coments on Vijay devarakonda Movie Arjun Reddy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu