»   » 'సామాన్యుడు' డైరక్టర్ తో సుమంత్

'సామాన్యుడు' డైరక్టర్ తో సుమంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సామాన్యుడు, విక్టరీ చిత్రాల దర్శకుడు రవి.సి.కుమార్ తాజాగా సుమంత్ హీరోగా మరో చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం సోషల్ మెసేజ్ కలిగిన ఓ రొమాంటిక్ ఫిల్మ్ గా అభివర్ణిస్తున్నారు. ఇక రవి.సి.కుమార్ గతంలో రవి చావలి పేరుతో బ్రహ్మచారులు, కాలేజ్ వంటి కొన్ని సినిమాలు చేసారు. అయితే సామాన్యుడుతో ఆయన సక్సెస్ ని అందుకున్నారు. ఆ తర్వాత నితిన్ తో విక్టరీ రూపొందించి డిజాస్టర్ ఫలితాన్ని చవి చూసారు. అయితే అంతకు ముందు చేసిన చిత్రాల నుంచి పాఠాలు నేర్చుకున్నానని, ఈ సారి హిట్ తధ్యమని ఆయన చెప్తున్నారు. స్టోరీ లైన్ కరెక్టుగా సుమంత్ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయేదని, త్వరలోనే మిగతావివరాలు తెలియచేస్తామని అంటున్నారు. ఇక సుమంత్ కూడా వరస ఫ్లాఫులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆయనక్కూడా హిట్ కావాల్సి ఉంది. కాబట్టి ఈ కాంబినేషన్ వర్కవుట్ అయితే ఇద్దరకీ ఉపయోగం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu