»   » డిప్రెషన్ లో శ్రీను వైట్ల....? తీవ్ర నిరాశ లో ఉన్నాడంటూ వార్తలు

డిప్రెషన్ లో శ్రీను వైట్ల....? తీవ్ర నిరాశ లో ఉన్నాడంటూ వార్తలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నీ కోసం, ఆనందం, సొంతం, వెంకీ, అందరివాడు, ఢీ, దుబాయ్ శీను, రెడీ, కింగ్, దూకుడు, బాద్‍షా ఊకో సినిమా ఒక్కో నవ్వుల పంట, సున్నితమైన ప్రేమకథ చెప్తూనే అద్బుతమైన కామెడీతో సినిమా తీయటం ఒకప్పటి శ్రీనూ వైట్ల స్టైల్. కొన్నాళ్ళ పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖ దర్శకుల్లో ఒకడుగా ఒక వెలుగు వెలిగిన శ్రీనూ వైట్ల ఇప్పుడు లైం లైట్ కి దూరం అయ్యాడు... వరుసగా మూడో సినిమా మిస్టర్ కూడా డిజాస్ట ర్ అవటం తో ఇప్పుడు బాగా కుంగి పోయడని చెప్పుకుంటున్నారు...

కెరీర్ గ్రాఫ్ పడిపోయింది.

కెరీర్ గ్రాఫ్ పడిపోయింది.

శ్రీనువైట్ల పదికోట్లకి పైగా పారితోషికం అందుకునే వాడు శ్రీను వైట్ల. మెగా స్టార్ ని కూడా డైరెక్ట్ చేసే అవకాశాన్ని తొందరగానే అందుకున్నాడు అయితే 'అందరివాడు' సినిమాతో తొలిసారి చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసిన శ్రీను వైట్ల... ఆ సినిమాను సక్సెస్ ఫుల్‌గా మలచలేకపోయాడు. ఆ తర్వాత కూడా కింగ్ నాగార్జున తోనూ, రవి తేజ తోనూ సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించాడు. మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసాడు అనుకున్న సమయం లో ఆయన కెరీర్ గ్రాఫ్ దారుణం గా పడిపోయింది.

దారుణం గా దెబ్బతీసింది

దారుణం గా దెబ్బతీసింది

ఆ తర్వాత కొన్నాళ్ళకి మెగా ఫ్యామిలీలోని క్రేజీ హీరో రామ్ చరణ్‌తో 'బ్రూస్ లీ' సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ద్వారా రామ్ చరణ్‌కు హిట్ రావడంతో పాటు శ్రీను వైట్ల మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని అప్పట్లో చాలామంది భావించారు. కానీ రామ్ చరణ్ ఖాతాలో ఈ సినిమా ఓ ఫ్లాప్‌గా మిగిలిపోవడంతో... శ్రీను వైట్ల అప్ కమింగ్ హీరో అయిన వరుణ్ తేజ్‌తో సినిమా చేయడానికి సిద్ద పడ్డాడు అయితే ఈ సినిమా కూడా దారుణం గా దెబ్బతీసింది.

మూడు డిజాస్టర్‌ సినిమాలు

మూడు డిజాస్టర్‌ సినిమాలు

వరుసగా మూడు డిజాస్టర్‌ సినిమాలు అందించడంతో అతడికి ఇచ్చిన అడ్వాన్సులని కూడా నిర్మాతలు వెనక్కి తీసేసుకున్నారు. ఏ స్టార్‌ హీరోతోను సత్సంబంధాలు లేకపోవడంతో ఈ కష్టకాలంలో తనకి సాయపడే వాళ్లు కనిపించడం లేదు. 'మిస్టర్‌' చిత్రానికి అసలు పారితోషికమే రాకపోగా, తన ఆస్తులే పోగొట్టుకున్నట్టు టాలీవుడ్‌ టాక్‌.

ఎవరినీ కలవడం లేదట

ఎవరినీ కలవడం లేదట

ఈ పరాజయం తర్వాత శ్రీను వైట్ల ఎవరినీ కలవడం లేదట. తన రైటర్స్‌ టీమ్‌తోను కాంటాక్ట్‌లో లేడట. విపరీతమైన డిప్రెషన్‌కి గురయ్యాడని, సన్నిహితులే అతడికి కౌన్సిలింగ్‌ ఇప్పిస్తున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. శ్రీను వైట్లకి పరాజయాలు కొత్త కాదు కానీ, ఇంతకుముందు ఇంతటి స్టార్‌ హోదా అందుకుని కింద పడిపోలేదు.

మళ్లీ పనిలో పడితే

మళ్లీ పనిలో పడితే

ఢీ తర్వాత బాద్షా వరకు ఎదురే లేకుండా పోయిన శ్రీను వైట్ల ఈ సమయంలో విజయాలతో పాటు శత్రువులనీ కొని తెచ్చుకున్నాడు. ఈ పరాజయాలని మర్చిపోయి మళ్లీ పనిలో పడితే ఇప్పటికీ అతనికి యువ హీరోల డేట్స్‌ దొరకడం కష్టమేం కాదని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు. త్వరగా ఈ ఫెయిల్యూర్స్‌ తాలూకు డిప్రెషన్‌ నుంచి వైట్ల బయటపడతాడని ఆశిద్దాం.

English summary
A new rumor is spreading in Tollywood That Director Srinu vytla in Depression with His Disasters
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu