»   » సెన్సేషన్:ఓ రేంజిలో ఏకిపారేసిన దర్శకుడు తేజ (వీడియో)

సెన్సేషన్:ఓ రేంజిలో ఏకిపారేసిన దర్శకుడు తేజ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దర్శకుడు తేజ రీసెంట్ గా జరిగిన ఆడియో పంక్షన్ లో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాల్లో కొత్తదనమన్నది ఈ మధ్య కాలంలో ఘనత చాటుకున్న పెద్ద సినిమాల్లో ఎప్పుడూ కనిపించలేదని మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనేం అన్నారో ఇక్కడ చూడండి


తేజ మాట్లాడుతూ.."నేనెప్పుడు కొత్త సినిమా తీసినా, ‘ఏమైనా జయం స్థాయిలో ఈ సినిమా లేదు సార్' అంటారు. అదే జయం సినిమాలోని ఏ ఒక్క సన్నివేశం వేరే సినిమాలో యాధృచ్చికంగా వచ్చినా, ‘మళ్ళీ జయం తీశాడ్రా' అంటారు. అసలు నన్నడిగితే ఈ మధ్య కాలంలో తెలుగులో ఘనత చాటుకున్న పెద్ద సినిమాల్లో ఏముంది? ఒక రెండు కథలుంటాయి. వాటినే గత పదేళ్ళుగా తీస్తూ వస్తున్నారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అందులో కొన్ని ప్రేక్షకాదరణ పొందుతూ వచ్చాయి కూడా. పెద్ద సినిమాల్లో అవే రెండు కథలను తిప్పి తీసినా ఫరవాలేదు కానీ, నేను మాత్రం ‘జయం' చేయకూడదా?" అంటూ వ్యాఖ్యానించారు తేజ. కాగా ఆయన తన వ్యాఖ్యలను సరదాగా తీసుకోవాలని కోరారు.


అలాగే.. ''హోరా హోరీ' ప్రచార చిత్రం చూసినవాళ్లంతా 'జయం'తో పోలుస్తుంటే ఆ సినిమా ఎందుకు తీశాన్రాబాబూ అనిపిస్తోంది. నా జీవితం 'జయం'తో మొదలై, దాంతోనే అంతమైపోయినట్టు మాట్లాడుతున్నారు. నేను ప్రేమకథలతో పాటు అన్నిరకాల సినిమాలూ తీశా. కానీ ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా ముద్ర వేశారు.


Director Teja Sensational Speech At Hora Hori Audio Launch

'హోరా హోరీ' సినిమా కోసం మేం రెయిన్‌ మెషీన్‌ తయారు చేశాం. లైట్లు వాడకుండా సినిమా తీశాం. నటీనటులెవరూ మేకప్‌ వేసుకోలేదు. నాతో పనిచేయడం ఓ టార్చర్‌ లాంటిది. కల్యాణి కోడూరు నేనూ చాలాసార్లు తగాదా పడ్డాం. కానీ తను మంచి పాటల్ని ఇచ్చాడు''అన్నారు తేజ.


‘హోరా హోరీ' పేరుతో తెరకెక్కిన ఈ సినిమాపై తేజ భారీ ఆశలే పెట్టుకున్నారు. దిలీప్, దక్షలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక హైద్రాబాద్‌లో జరిగింది.

English summary
Telugu film director Teja delivered a sensational speech at Hora Hori audio launch. Hora Hori Telugu Movie featuring Dileep, Daksha in lead roles. Directed by Teja. Hora Hori Telugu movie also stars Chaswa, Aberaam, DS Rao and Varaprasad. Produced by KL Damodar Prasad under the banner Sri Ranjith Movies.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu