»   » సిక్స్ ప్యాక్ కోసం స్టెరాయిడ్స్... ప్రమాదం కొనితెచ్చుకుంటున్న టాలీవుడ్ నటులు

సిక్స్ ప్యాక్ కోసం స్టెరాయిడ్స్... ప్రమాదం కొనితెచ్చుకుంటున్న టాలీవుడ్ నటులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు చిత్ర పరిశ్రమపై అప్పుడప్పుడు బాలీవుడ్ ప్రభావం పడుతుంటుంది. ముఖ్యంగా కథానాయకుల విషయంలో సిక్స్ ప్యాక్, కథానాయికల విషయంలో జీరో సైజులు అనేవి టాలీవుడ్ పై పెను ప్రభావాన్నే చూపించాయి. అయితే పుష్టిగా ... పుత్తడి బొమ్మలా వుండే కథానాయికలను ఇష్టపడే ఇక్కడి కుర్రకారు ప్రేక్షకులు, జీరో సైజులంటూ వగలు పోయిన హీరోయిన్లను ఇంటికి పంపించారు. ఇక హీరోలను మాత్రం సిక్స్ ప్యాక్ విషయంలో ప్రోత్సహించడంతో యువ కథానాయకులంతా జిమ్ బాట పట్టారు.

గతంలో హీరోలకు ఇంతటి కష్టం ఉండేది కాదు. శారీరక శ్రమ అవసరం అయ్యేది కాదు కానీ, అంతర్జాతీయ సినిమాలు సగటు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాక ప్రాంతీయ సినిమా నిలదొక్కుకోవడం మరీ కష్టమైంది. పరిమితికి లోబడి నిర్మాణం అవుతున్న చిత్రాల్లో కొత్తదనం చూపించాల్సిన బాధ్యత దర్శకులతో పాటుగా హీరో కి కూడా ఉంది. అందుకే కష్తమైన పాత్రలు సైతం చేయడానికి హీరోలు సానుకూలంగా ముందుకువస్తున్నారు.ఇందులో భాగంగా శరీరాకృతిని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కలల్లో కథానాయకులు కండలు తిరిగి ఉంటారు. పాత్రపరంగా అలాంటి శరీరాకృతి అవసరం అనుకుంటే సిక్స్‌ ప్యాక్‌ ఎయిట్ ప్యాక్ ల లోకి మారడానికి టాలీవుడ్‌ హీరోలు కృషి టేస్తున్నారు. దీనికోసం శారీరక శ్రమ తప్పదు. డైట్‌ కంట్రోలు చేసుకుంటూ, కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే సిక్స్‌ ప్యాక్‌ సాధిస్తున్నారు. అయితే ఇక్కడే వస్తోంది చిక్కు. అతితక్కువ కాలం లో సిక్స్ ప్యాక్ రావాలంటే మామూలుగా సాధ్యం కాదు... దానికి చాలా సమయం పడుతుంది. అందుకే షార్ట్ కట్ లో స్టెరాయిడ్స్ వాడుతూ అడ్దదారిలో సిక్స్ ప్యాక్ తెచ్చుకుంటున్నారట .

 స్టెరాయిడ్స్‌:

స్టెరాయిడ్స్‌:

బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌ హీరోల్లో చాలామంది సిక్స్‌ప్యాక్‌లతో కనబడుతున్నారు. అయితే ఇలా సిక్స్‌ప్యాక్‌లతో కనబడడానికి చాలా మంది అడ్డదారులను ఆశ్రయిస్తున్నారట. ఎంతో కఠినతరమైన వర్కవుట్లతోబాటు స్టెరాయిడ్స్‌ను కూడా సిక్స్‌ప్యాక్‌ కోసం ఉపయోగిస్తున్నారట. నిజానికి ఉదర భాగంపై ఆరుపలకలు రప్పించడం చాలా కష్టం. అనుమతించిన దానికి మించి మంచినీళ్లు కూడా ఎక్కువ తాగకూడదు.

ఎక్కువ కాలం ఉండదు:

ఎక్కువ కాలం ఉండదు:

దారుణమైన డైటింగ్‌ చేయాలి. ఇంతచేసినా సిక్స్‌ప్యాక్‌ అనేది ఎక్కువ కాలం ఉండదు. చాలా తక్కువ పరిమాణంలో నూనెతో చేసిన ఆహారం తీసుకున్నా సిక్స్‌ప్యాక్‌ పోతుంది.ముందు పొట్తపై పలకలు తెప్పించటం ఒక ఎత్తయితే తర్వాత వాటిని కాపాడుకోవటం మరో ఎత్తు...

స్టార్‌ హీరోలు సైతం:

స్టార్‌ హీరోలు సైతం:

అందుకే చాలామంది స్టార్‌ హీరోలు సైతం సిక్స్‌ప్యాక్‌ కోసం స్టెరాయిడ్‌లను వాడుతున్నారట. వీటిని వాడడంతో బాటు కొన్ని కఠినతరమైన వ్యాయామాలు చేయడం వల్ల చాలా తక్కువ సమయంలోనే సిక్స్‌ప్యాక్‌ బాడీని సొంతం చేసుకోవచ్చట. అయితే ఇలా ఉపయోగించే స్టెరాయిడ్‌లు వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయట.

సిక్స్‌ప్యాక్‌ :

సిక్స్‌ప్యాక్‌ :

హాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కు..అక్కడ్నుంచీ టాలీవుడ్‌కు పాకిన సిక్స్‌, ఎయిట్‌ ప్యాక్‌ల సంస్కృతి గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. అంతకుముందు పాత్రల కోసం బాడీబిల్డింగ్‌ చేసిన ఉదాహరణలు ఉన్నప్పటికీ కెరీర్‌ తొలిదశలో అల్లు అర్జున్‌ ‘దేశముదురు' చిత్రం కోసం సిక్స్‌ప్యాక్‌ చేసి దీనికి టాలీవుడ్‌లో క్రేజ్‌ వచ్చేలా చేశారని అంటారు.

టాలీవుడ్‌ హీరోలు :

టాలీవుడ్‌ హీరోలు :

ఇక అప్పట్నుంచీ సిక్స్‌ప్యాకే కాదు ఎయిట్‌ప్యాక్‌ కూడా చేయడాన్ని కూడా టాలీవుడ్‌ హీరోలు మొదులుపెట్టారు. ప్రభాస్‌, జూ.ఎన్టీఆర్‌, రవితేజ, సునీల్‌, సుధీర్‌బాబు, నితిన్‌ వంటి పలువురు హీరోలు లోగడ ఈ ప్యాక్‌లు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా కల్యాణ్‌రామ్‌ ‘ఇజం' చిత్రం కోసం సిక్స్‌ప్యాక్‌ చేశాడు.

 అందరూ అలా అనికాదు :

అందరూ అలా అనికాదు :

ఇందులోని పాత్ర కు కొత్తగా కనిపించడంతో పాటు సిక్స్‌ప్యాక్‌ చేస్తే బావుంటుందని దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఇచ్చిన సూచన మేరకు కల్యాణ్‌రామ్‌ ఆ విధంగా కనిపించటానికి బాగానే కష్ట్పడ్డాడు. అయితే అందరూ అలా అనికాదు గానీ ఆరోగ్యం మీద ప్రభావం చూపే స్టెరాయిడ్ లు వాడే వారి సంఖ్యా ఎక్కువగానే ఉందట...

English summary
Most of the Tollywood actors depending on the amount of time they get to build their body for the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu