Just In
- 15 min ago
KRACK వివాదం.. దిల్ రాజు గురించి మాట్లాడే అర్హతే లేదు.. బెల్లంకొండ సురేష్ కామెంట్స్
- 1 hr ago
క్రాక్ ఓటీటీ రిలీక్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు రాబోతోందంటే?
- 1 hr ago
ఇన్నేళ్లకు ఆ విషయం తెలిసింది.. ఇకపై నేనేంటో చూపిస్తా.. రామ్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
సలార్ సినిమాకు హీరోయిన్ టెన్షన్.. వాళ్ళు ఖాళీగా లేరట
Don't Miss!
- News
తిరుమలలో అపచారం: ఎక్కడి నుంచి వచ్చాయో గానీ: శ్రీవారి ఆలయం వద్ద తిష్ఠ: భక్తుల అసహనం
- Sports
యువరాజ్ సింగ్ పంచుకున్న భరతనాట్యం బౌలింగ్.. చూస్తే వావ్ అనాల్సిందే!వీడియో
- Finance
startup India seed fund: స్టార్టప్స్ కోసం రూ.1000 కోట్ల నిధి
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'మర్యాద రామన్న'ని దెబ్బకొడ్తోన్న 'దూకుడు'
రాజమౌళి, సునీల్ కాంబినేషన్ లో వచ్చి హిట్టైన మర్యాద రామన్న చిత్రం కన్నడంలో రీమేకై రీసెంట్ గా విడుదలైంది. అక్కడా మంచి టాక్ తో వెళ్ళుతున్నట్లు టాక్. అయితే అక్కడ ఈ సినిమాకు విచిత్రంగా దూకుడు అడ్డం వస్తోంది. కన్నడ వాళ్లు సైతం దూకుడు సినిమా వైపై చూడటంతో ఇబ్బందికరంగా మారింది. అక్కడ ట్రేడ్ రిపోర్ట్ ల ప్రకారం..బెంగుళూరు మఠహళ్లిలోని రాధాకృష్ణ థియేటర్‌లో ఇప్పటి వరకు నమోదైన అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. అన్ని షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. టికెట్లను బ్లాక్‌లో రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు.దాంతో మర్యాదరామన్నకు దెబ్బైంది.ఇక కోమల్ అనే ఆర్టిస్టు మర్యాద రామన్న లో సునీల్ పాత్రను చేసాడు. కీరవాణి సంగీతం అందించాడు. తెలుగు ఉన్నదున్నట్లుగా అనువదించారు. ఉపేంద్ర అక్కడ సైకిల్ వాయిస్ కి డబ్బింగ్ ఇచ్చారు. తెలుగులో రవితేజ చెప్పినట్లుగా. చేసాడు. ముకేష్ రుషి..ఇక్కడ తెలుగులో నాగినీడు పాత్రను చేసాడు. నిషా అక్కడ హీరోయిన్ గా సలోని పాత్రను చేసింది.
మరో ప్రక్క ఈ మర్యాద రామన్న హిందీలోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఎస్.ఓ.ఎస్ (సన్ ఆఫ్ సర్ధార్) తో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ఇప్పటికే ఎనభో కోట్ల వరకూ బిజినెస్ ఆఫర్ వచ్చిందని, సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే ఈ రేంజి బిజినెస్ కావటం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. దీనికి కారణం అజయ్ దేవగన్ రీసెంట్ చిత్రం సింగం అని చెప్తున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది.దాంతో ఈ చిత్రం ఎఫెక్ట్ మర్యాద రామన్న రీమేక్ పై పడింది.ఆ చిత్రాన్ని అజయ్ దేవగన్ తో అతిధి తుమ్ కబ్ జావోగి అనే కామిడీ చిత్రం రూపొందించిన అశ్విని ధిర్ డైరక్ట్ చేస్తున్నాడు. అయితే హిందికి తగినట్లు కొన్ని మార్పులు చేస్తున్నట్లు చెప్తున్నారు. హీరోయిన్ ని ఎంపిక చేసి షూటింగ్ ప్రారంభిస్తామంటున్నారు.