»   » ఫస్టాఫ్ సూపర్, సెకండాఫ్ యావరేజ్......‘డిజె’ మూవీ ట్విట్టర్ రివ్యూ...

ఫస్టాఫ్ సూపర్, సెకండాఫ్ యావరేజ్......‘డిజె’ మూవీ ట్విట్టర్ రివ్యూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన 'డిజె-దువ్వాడ జగన్నాథమ్' మూవీ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజైంది. ఇండియాలో మార్నింగ్ షోలు పడటానికి ముందే యూఎస్ఏ, ఇతర దేశాల్లో ప్రీమియర్ షోలో పడ్డాయి. సినిమా చేసిన ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

'దువ్వాడ జగన్నాథమ్' చిత్రాన్ని దర్శకుడు హరీష్ శంకర్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టెనర్ గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి హరీష్ స్వయంగా స్టోరీ, డైలాగులు అందించగా రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ లాంటి వారితో కలిసి ఎంటర్టెనింగ్ స్క్రీన్ ప్లే రెడీ చేశారు. దిల్ రాజు నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి 25వ చిత్రం కావడంతో ఈచిత్రాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.


'డిజె-దువ్వాడ జగన్నాథమ్' ఓ పోలీస్ ఆఫీసర్ గురించిన ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఓ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా బ్రాహ్మిణ్ వంటవాడిగా మారువేశం వేస్తాడు. సినిమా తొలి భాగం కామెడీ సీన్లు, రొమాన్స్, పాటలతో ప్రేక్షకులను అలరిస్తుంది.


ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు సినిమా చాలా బ్రిలియంట్ గా తెరకెక్కించారని, సినిమా సెకండాఫ్ కూడా ఇంటెన్స్ యాక్షన్ తో బావుందని, అయితే ఫస్టాఫ్ తో పోలిస్తే యావరేజ్ అంటున్నారు ఆడియన్స్.


అల్లు అర్జున్ సూపర్

అల్లు అర్జున్ సూపర్

అల్లు అర్జున్ ఈ చిత్రంలో బ్రాహ్మిణ్, డిజె క్యారెక్టర్లలో అద్భుతంగా నటించారని, సినిమాలో అతడి స్టైల్ కూడా చాలా బావుందని అంటున్నారు. సినిమాలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ హైలెట్ గా ఉందని ఆడియన్స్ తెలిపారు.


ఎవరు ఎలా చేశారు?

ఎవరు ఎలా చేశారు?

ఎలక్ట్రిఫయింగ్ యాక్షన్ సీన్లు, డాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా అన్ని విషయాల్లోనూ అల్లు అర్జున్ అదరగొట్టాడట. పూజా హెగ్డే తన పాత్రకు న్యాయం చేసింది. గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా బన్నీతో ఆమె కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని అంటున్నారు. రావు రమేష్, తనికెళ్ల భరణి, మురళి శర్మ, వెన్నెల కిషోర్ పాత్రలు ప్రేక్షకులను అలరించాయని పలువురు ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు.


టెక్నికల అంశాల పరంగా

టెక్నికల అంశాల పరంగా

నిర్మాత దిల్ రాజు తమ బేనర్లో 25వ సినిమా కావడంతో....ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారని, సినిమా నిర్మాణ వలువలు చాలా రిచ్ గా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాలో మరో హైలెట్, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టాడు. అయానంక బోస్ పిక్చరైజేషన్ ఎంతో అద్భుతంగా ఉందని.... డాన్స్, యాక్షన్ ఇలా అన్ని విషయాల్లోనూ సినిమాటోగ్రఫీ అదిరిపోయిందని అంటున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ కూడా చాలా బావుందట. సినిమా చూసిన ఆడియన్స్ తమతమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆ ట్వీట్లు చూస్తే సినిమా ఎలా ఉందనే విషయంలో మీరూ ఓ అభిప్రాయానికి రావొచ్చు.


ఫస్టాఫ్ గుడ్, సెకండాఫ్ యావరేజ్

.


రోటీన్ మసాలా మూవీ

.


ఇతడికి సినిమా నచ్చలేదేమో?

.


ఒకసారి చూడొచ్చు

.


ఫ్యామిలీ మాస్ ఎంటర్టెనర్

.


బోరింగ్

.


సెకండాఫ్ బాగోలేదు

.


ఊహించిన స్థాయిలో లేదు

.


ఫస్టాఫ్ బావుంది

.


ఎబో యావరేజ్

.


English summary
Director Harish Shankar's Telugu movie DJ aka Duvvada Jagannadham starring Allu Arjun and Pooja Hegde, has received mixed reviews and good ratings from the audiences.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu