»   » 4 గంటలు సేపు...షారూక్‌ ను ప్రశ్నించిన ఈడీ

4 గంటలు సేపు...షారూక్‌ ను ప్రశ్నించిన ఈడీ

Written By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: బాలీవుడ్‌ నటుడు షారూక్‌ ఖాన్‌నుఈడీ అధికారులు మరోసారి ప్రశ్నించారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆర్థిక లావాదేవీలపై సుమారు 4 గంటలపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు షారూక్‌ను ప్రశ్నించినట్లు సమాచారం.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టును బాలీవుడ్ నటి జూహి చావ్లా, ఆమె భర్త జయ్ మెహతాతో కలిసి షారుఖ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ జట్టుకు సంబంధించిన కొన్ని షేర్లను 2008లో షారుక్ ఖాన్ మారిషస్‌కు చెందిన ఓ సంస్ధకు విక్రయించాడు.

Sharuk Khan

ఈ షేర్ల విక్రయం ఫెమా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా మే, 2015న ఈడీ షారుఖ్‌కు సమన్లు జారీ చేసింది.

షారూఖ్ తాజా చిత్రాల విషయానికి వస్తే..

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ కొత్త చిత్రం 'ఫ్యాన్‌' టీజర్‌కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. షారుఖ్‌ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్‌ 1 అర్ధరాత్రి విడుదలైన ఈ టీజర్‌ను ఇప్పటి వరకు దాదాపు 20 లక్షల మంది వీక్షించారు.
అంతే కాకుండా దాదాపు 25 వేల లైక్స్‌ వచ్చాయి.

Sharuk fan

మనీశ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఆదిత్య చోప్రా నిర్మాత. ఈ సినిమా ఏప్రిల్‌15న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రంలో షారుఖ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 'ఫ్యాన్‌' గౌరవ్‌ పాత్రలో ఆయన ఎంతో వినూత్నంగా ఉన్నారని పలువురు అభినందన వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. టీజర్‌కి భారీ స్పందన రావడం పట్ల చిత్రం బృందం హర్షం వ్యక్తం చేసింది.

English summary
Enforcement Directorate questions Shah Rukh Khan for 4 hours in forex violation case.
Please Wait while comments are loading...