Just In
- 50 min ago
దానికి రెడీ అంటూ అలీకి షాకిచ్చిన షకీలా: తెలుగు డైరెక్టర్ ఫోన్.. మోసం చేసింది ఆయనంటూ లీక్ చేసింది
- 1 hr ago
ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
- 1 hr ago
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- 2 hrs ago
మోనాల్‌తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా కామెంట్స్!
Don't Miss!
- Sports
ఆస్ట్రేలియాని వెనక్కి నెట్టిన టీమిండియా.. నెం.1లో న్యూజిలాండ్!
- News
Paul Dhinakaran జీసస్ కాల్స్ సంస్థలపై ఐటీ దాడులు .. ఎన్నికలకు ముందే..!
- Finance
41 కోట్ల జన్ ధన్ ఖాతాలు, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ 7.5%
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మనసు దోచేస్తున్న సిత్తరాల సిరపాడు పాట.. ఆ పాట రాసిందేవరంటే..
అల వైకుంఠపురములో సినిమాను చూసి బయటకు వచ్చిన ప్రతీ ఒక్కరి మదిలో మెదిలో ప్రశ్న ఒక్కటే. అదే సిత్తరాల సిరపడు పాట ఎక్కడిది? ఎవరు రాశారు?. బన్నీ స్టైలీష్ స్టెప్పులు, అంతకంటే స్టైలీష్‌గా కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్, వినసొంపైన తమన్ బాణీ ఇలా ప్రతీ ఒక్కటి సిత్తరాల సిరపడును మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేసింది. అయితే ఆ పాటను త్వరగా విడుదల చేయండని అభిమానులు కోరితే.. శుక్రవారం రిలీజ్ చేశారు. ఇక చెప్పేదేముంది.. ఈ పాట కూడా యూబ్యూబ్‌లో రికార్డుల మోత మోగించడం ప్రారంభించింది. ఇంత వరకు బాగానే ఉంది పర్లేదు.. అయితే ఈ పాట రాసింది ఎవరు? ఆయన నేపథ్యం ఏంటి? అనే వాటి గురించి వెతకడం ప్రారంభించారు నెటిజన్లు.

విజయ్ కుమార్ నేపథ్యం..
సిత్తరాల సిరపడు పాటను రాసింది విజయ్ కుమార్ భల్లా. ఆయనది ఒడిషాలోని జయపూర్. ఎల్ఐసీలో ఉద్యోగ రీత్యా నాగావళి నుంచి వంశధార వరకు తిరిగాడు. ప్రస్తుతం మచిలీపట్నం ఎల్ఐసీ డివిజన్ కార్యాలయంలో ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు గజల్స్, జానపద గేయాలంటే చాలా ఇష్టమట. ఎల్ఐసీ తనను ఊరూరా తిప్పి అక్కడి జనపదాలను పరిచయం చేసిందని చెప్పుకొచ్చాడు.

సిరివెన్నెల తమ్ముడి వల్లే ఈ పాట
తనకు జానపద గేయాలంటే చాలా ఇష్టమని, చిన్న చిన్న గజల్స్ రాయడం అంటే మక్కువని తెలిపాడు. ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే చిన్నచిన్నగా రాసిస్తుంటానని పేర్కొన్నాడు. ఈ క్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు సీవీఆర్ శాస్త్రిగారితో మంచి అనుబంధం ఏర్పడిందన్నాడు. హుద్ హుద్ తుఫాను అప్పుడు తాను రాసిన సంకల్ప్ గీతం ఆయనకు బాగా ఇష్టమని, అందువల్ల అల వైకుంఠపురంలో శ్రీకాకుళం యాసలో జానపద గేయం కావాలని దర్శకుడు త్రివిక్రమ్ తన టీంతో ఆరా తీస్తున్నప్పుడు తన పేరును సూచించినట్టు తెలిపాడు.

ఎక్కడా దొరకలేదు..
ఆయన తన టీంను పంపించి శ్రీకాకుళంలో బాగా ప్రజాదరణ పొందిన జానపద గేయాలు అన్వేషించమని కోరారని తెలిపాడు. రేలరేల జానకిరావుతోపాటు చాలా మందికి ఈ విషయాన్ని చెప్పానని, ఎవరు కూడా సరైంది ఇవ్వలేకపోయారని అన్నాడు. దువ్వందొర అనే పాట ఒకటి దొరికిందని, అది సరిపోతుందని చెప్పాను కానీ సందర్భోచితంగా లేదని అన్నారని తెలిపాడు. సెప్టెంబర్ 18న చెప్పారు.. 19న వెతికాం.. ఒక్కపాట దొరకలేదు. ఇక సమయం లేదని తానే ఒక పల్లవి, ఏడెనిమిది చరణాలు రాసిచ్చానని చెప్పుకొచ్చాడు.

ప్రతీ పదానిని ఆప్షన్స్..
సిరపడు అనే పదాన్ని శ్రీకాకుళం ప్రాంతంలో పెంకితనం, అల్లరి పిల్లలను ఉద్దేశించి ఎక్కువగా వాడుతుంటారని తెలిపాడు. తాను రాసిన ప్రతి పదానికి మరో ఆప్షన్ ఇచ్చాను. ఉదాహారణకు ఉద్దండుడు అనే పదం ఉందని, దాన్ని ఉడుంపట్టు అని కూడా వాడుకోవచ్చని అన్నాడు. అయితే రిలీజ్ చేసిన పాటలో ఉడుంపట్టు అని ఉంది. సినిమాలో ఉద్దండుడు అని వినిపిస్తుందని తెలిపాడు. అలానే గండుపిల్లి కానీ పెద్దపులి కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అని చెప్పానని పేర్కొన్నాడు. అలా అప్షన్ ఇవ్వడం వల్ల తనను తిరిగి అడగలేదు. ప్రత్యమ్నాయ పదాలు చూసుకొని వాడుకున్నారని తెలిపాడు.