»   » ఇదే ఎన్టీఆర్ నిజస్వరూపం.... ముద్దులు పెట్టిన అభిమాని పట్ల ఇలా!

ఇదే ఎన్టీఆర్ నిజస్వరూపం.... ముద్దులు పెట్టిన అభిమాని పట్ల ఇలా!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jr. NTR Real Behaviour అభిమాని పట్ల ఇలా!

చాలా మంది స్టార్ హీరోలు సినిమా ఫంక్షన్లలో అభిమానులను ఆకాశానికి ఎత్తేస్తుంటారు. మీ వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నాం, మీరు లేక పోతే మేము లేము, ఈ జీవితం మీరు పెట్టిన బిక్ష అంటూ ప్రసంగాలు దంచుతూ ఉంటారు.

అయితే అభిమానులు మీద మీదకు వచ్చి....తాము ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ఆ హీరోల నిజస్వరూపం బయట పడుతుంది. వారు చేసిన ప్రసంగాలకు భిన్నంగా వారి ప్రవర్తన ఉంటుంది. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆ టైపు కాదని తేలిపోయింది.

తాజాగా 'జై లవ కుశ' ట్రైలర్ రిలీజ్ వేడుకలో ఓ అభిమాని ఎన్టీఆర్ వద్దకు దూసుకొచ్చాడు. అపుడు ఎన్టీఆర్ స్పందించిన తీరు చర్చనీయాంశం అయింది.

ఊహించని ఘటన

ఊహించని ఘటన

తారక్ చుట్టూ ఉండే భద్రతా వలయాన్ని చేధించుకుని ఓ అభిమాని ఎన్టీఆర్ వద్దకు దూసుకొచ్చాడు. దీంతో షాకైన చుట్టూ ఉన్న బౌన్సర్లు అతడిని అక్కడి నుండి లాగేసే ప్రయత్నం చేశాడు. అయితే ఎన్టీఆర్ వారిని ఆపి... ఆ అభిమానికి హగ్ ఇచ్చాడు.

ముద్దు పెట్టిన ఫ్యాన్

ముద్దు పెట్టిన ఫ్యాన్

హగ్ ఇవ్వడంతో ఆగని ఆ అభిమాని ఎన్టీఆర్ బుగ్గమీద ముద్దు పెట్టి మరింత రెచ్చిపోయాడు. అయినా సరే తారక్ నుండి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. ముద్దు ఘటనతో అంతా ఒక్కసారి గా షాయ్యారు. ఈ క్రమంలో కొందరు అతడిపై బలప్రయోగం చేసే ప్రయత్నం చేయగా... తారక్ వారిని వారించి, అతడిని ఏమీ అనొద్దు అని సైగ చేశాడు.

పొంగిపోయిన ఫ్యాన్స్

పొంగిపోయిన ఫ్యాన్స్

ఈ సంఘటన చూసిన ఎన్టీఆర్ అభిమానులు పొంగిపోయారు. తామ ఎన్టీఆర్‌ను ఎంతగా గౌరవిస్తామో.... ఎన్టీఆర్ కూడా తమ పట్ల అంతే గౌరవంగా ఉంటాడు అనడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదని అంటున్నారు అభిమానులు. ప్రాంగణమంతా అభిమానుల కేరింతలతో మారుమోగిపోయింది.

ఈ జన్మకి అభిమానులతోనే

ఈ జన్మకి అభిమానులతోనే

‘జై లవ కుశ' ట్రైలర్ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.... నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నాన్నా.... ఇంకో జన్మ ఉంటే మీ రుణం తీర్చుకుంటాను. ఈ జన్మ మాత్రం వీళ్లతో(అభిమానులు) ఉండిపోతాను. ఒక తల్లి కడుపున పుట్టక పోయినా మీరు చూపించే అభిమానం, ప్రేమ ఎన్నో జన్మల సుకృతం అనుకుంటాను. మీ అందరి రూపంలో ఇంత గొప్ప కుటుంబం దొరికింది... అని ఎన్టీఆర్ అన్నారు.

మీ దగ్గర ప్రయత్నించడం ఉండదు

మీ దగ్గర ప్రయత్నించడం ఉండదు

ఒక మంచి భర్తగా ఉండటానికి ప్రయత్నిస్తాను, ఒక మంచి తండ్రిగా ఉండటానికి ప్రయత్నిస్తాను, ఒక మంచి కొడుకుగా ఉండటానికి ప్రయత్నిస్తాను, ఒక మంచి తమ్ముడిగా ఉండటానికి ప్రయత్నిస్తాను...కానీ మీ(అభిమానులు) దగ్గర మాత్రం ప్రయత్నించడం ఉండదు. మీ దగ్గర ఎప్పుడూ ఎమోషనే ఉంటుంది అని ఎన్టీఆర్ అన్నారు.

రక్తం ధారపోసి మీ అందరితో ఇలాగే ఉండిపోతా

రక్తం ధారపోసి మీ అందరితో ఇలాగే ఉండిపోతా

రక్తం ధారపోసి మీ అభిమానులందరితో ఇలాగే ఉండిపోతానని మనవి చేసుకుంటున్నాను. నాకు ఎవరూ ముఖ్యం కాదు, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకమే ముఖ్యం. మీకు నచ్చే వరకు, మీరు గర్వంగా తలెత్తుకుని తిరిగే వరకు ఎల్లప్పుడూ ఇలాగే పోరాడూతూనే ఉంటాను. మంచి చిత్రాలు తీసి మీ రుణం తప్పకుండా ఈ జన్మలో తీర్చుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకో జన్మంటూ ఉంటే ఆ జన్మలో కూడా మీ రుణం తీర్చుకోవడానికి ట్రై చేస్తాను. ఈ రోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు... అని ఎన్టీఆర్ అన్నారు.

English summary
Tollywood Super Star Young Tiger NTR Die-hard Fan Jump on him for a Tight Hug and kiss. During the Jai Lava Kusa Pre Release Function, a fan reached the front row where JR NTR was sitting with Kalyan Ram and Sukumar and suddenly a Fan hugged the actor shocking everybody present there.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu