»   » అప్పటి వరకు పెళ్లి చేసుకోను.. అడ్డంకులను ఎదురిస్తా.. విశాల్

అప్పటి వరకు పెళ్లి చేసుకోను.. అడ్డంకులను ఎదురిస్తా.. విశాల్

Written By:
Subscribe to Filmibeat Telugu

తమిళ నడిగర్ సంఘం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నటుడు విశాల్ నిలబెట్టుకొన్నారు. నటుల సంఘం భవన నిర్మాణాన్ని చెన్నైలో శుక్రవారం ప్రారంభించారు. భవన శంకుస్థాపన కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమల్ హాసన్, అజిత్, సీనియర్ నటుడు విజయ్ కుమార్, ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Vishal

గతంలో హోరాహోరీగా జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థులను ఎదురించి విశాల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సంఘం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు కూడా.

అప్పటివరకు పెళ్లి చేసుకొను..

అప్పటివరకు పెళ్లి చేసుకొను..

భవన శంకుస్థాపన కార్యక్రమంలో విశాల్ మాట్లాడుతూ.. బిల్డింగ్ నిర్మాణం పూర్తయ్యేంత వరకు పెళ్లి చేసుకొని శపథం చేశాడు. ఈ భవన నిర్మాణాన్ని అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటాను అని విశాల్ తెలిపారు. ఈ భవన నిర్మాణం వచ్చే ఏడాది సెప్టెంబర్‌ కల్లా పూర్తి అవుతుంది అని చెప్పాడు. ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాను అని అన్నాడు.

మొట్టమొదటి శుభకార్యం అదే..

మొట్టమొదటి శుభకార్యం అదే..

వచ్చే ఏడాది ఈ భవన నిర్మాణం పూర్తయితే అందులో జరిగే మొట్టమొదటి శుభకార్యం విశాల్ పెళ్లి అవుతుందనే ఆశాభావాన్ని పలువురు సీనియర్ నటులు ఆకాక్షించారు. ఎట్టకేలకు భవన నిర్మాణానికి పునాది పడటం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే ప్రతినెల రూ.50 లక్షల ఆదాయం వస్తుంది. దాంతో పేద కళాకారులను ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు.

విశాల్ పెళ్లి 2018లోనే..

విశాల్ పెళ్లి 2018లోనే..

అనుకున్న ప్లాన్ ప్రకారం భవన నిర్మాణం పూర్తయితే హీరో విశాల్ పెళ్లి 2018లోనే జరుగుతుంది. సెప్టెంబర్ కల్లా పూర్తయితే 2018 ఏడాది చివర్లో విశాల్ పెళ్లి జరుగడానికి అవకాశాలుంటాయి. అప్పటివరకు అభిమానులు విశాల్ పెళ్లి కోసం వేచిచూడాల్సిందే.

విశాల్, కార్తీ రూ.10 కోట్ల సహాయం

విశాల్, కార్తీ రూ.10 కోట్ల సహాయం

ఈ భవన నిర్మాణం సాఫీగా జరుగడానికి అవసరమయ్యే ఆర్థిక సహాయాన్ని విశాల్, కార్తీ ప్రకటించారు. భవన నిర్మాణం కోసం ఒక్కొక్కరు రూ.10 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. తెలుగువాడైనా తమిళంలో స్టార్‌ హీరోగా ఎదిగిన విశాల్‌ తెరపైనే కాకుండా వాస్తవ జీవితంలో తన సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు.

శరత్ కుమార్ కూతురితో విశాల్ అఫైర్

శరత్ కుమార్ కూతురితో విశాల్ అఫైర్

ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తే వరలక్ష్మి, హీరో విశాల్ మధ్య అఫైర్ ఉన్నట్టు రూమర్ ప్రచారంలో ఉన్నది. ఇటీవల విశాల్, వరలక్ష్మి పెళ్లి వార్తలు మీడియాలో జోరుగా ప్రచారమయ్యాయి. అదే కనుక నిజమైతే వచ్చే ఏడాది చివరి వరకు వీరి పెళ్లి కోసం ఆగాల్సిందే.

English summary
During the Nadigara Sangam building foundation laying ceremony happend on Friday morning. Vishal, the general secretary of the union, was more than happy to receive Rajinikanth, Kamal Haasan and others. Vishal had said this earlier, he still sticks to his plan of getting married as soon as the new place is ready.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu