»   » 60 వ ఫిల్మ్ ఫేర్ లోనూ పవన్ దే హవా...(ఫోటో ఫీచర్)

60 వ ఫిల్మ్ ఫేర్ లోనూ పవన్ దే హవా...(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం రాత్రి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. సినీ రంగ ప్రముఖులు, నటీనటులు హాజరై సందడి చేశారు. టాప్ అవార్డ్స్ ని ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన "ఈగ", పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "గబ్బర్ సింగ్" సినిమాలు కైవసం చేసుకున్నాయి.

60 వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో ఈగ, గబ్బర్ సింగ్, బిజినెస్ మాన్, జులాయి, రచ్చ, ఇష్క్, ఢమరుకం సినిమాలు కూడా పలు విభాగాల్లో నామినేట్ అవ్వగా అన్నిటి కంటే ఎక్కువ మరియు కీలకమైన అవార్డ్స్ ని ఈగ, గబ్బర్ సింగ్ సినిమాలు దక్కించుకున్నాయి.

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకి గాను బెస్ట్ హీరో అవార్డు సొంతం చేసుకున్నారు, అలాగే గబ్బర్ సింగ్ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్(దేవీశ్రీ ప్రసాద్), బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (వడ్డేపల్లి శ్రీనివాస్) అవార్డ్స్ వచ్చాయి. రామ్ చరణ్ అవార్డు అందుకున్నాడు.

ఈగ చిత్రానికి గాను ఎస్ ఎస్ రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు అందుకున్నారు, అలాగే ఈగ మూవీకి ఉత్తమ చిత్రం, బెస్ట్ హీరోయిన్ (సమంత), ఉత్తమ సహాయ నటుడు (సుదీప్), బెస్ట్ విఎఫ్ఎక్స్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది.


తెలుగు చిత్రాలకు వచ్చిన అవార్డు వివరాలు...

ఈగ

ఈగ

ఈ చిత్రానికి బెస్ట్ ఫిల్మ్ గా నిర్మాత సాయి కొర్రపాటికి అవార్డు వరించింది. అలాగే బెస్ట్ డైరక్టర్ గా ఈగ దర్శకుడు రాజమౌళికి అందింది. బెస్ట్ హీరోయిన్ (సమంత), ఉత్తమ సహాయ నటుడు (సుదీప్), బెస్ట్ విఎఫ్ఎక్స్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈగ చిత్రంలో నాని, సమంత హీరో,హీరోయిన్స్ గా నటించారు. విలన్ గా చేసిన సుదీప్ అద్బుతంగా రక్తి కట్టించారు. నాని చనిపోయి ఈగ గా పునర్జన్మ ఎత్తి, తన పగని తీర్చుకోవటమే కథాంశం.

గబ్బర్ సింగ్

గబ్బర్ సింగ్

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకి గాను బెస్ట్ హీరో అవార్డు సొంతం చేసుకున్నారు, అలాగే గబ్బర్ సింగ్ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్(దేవీశ్రీ ప్రసాద్), బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (వడ్డేపల్లి శ్రీనివాస్) అవార్డ్స్ వచ్చాయి. రామ్ చరణ్ అవార్డు అందుకున్నాడు. ఈ చిత్రం దబాంగ్ చిత్రం రీమేక్ గా వచ్చి ఘన విజయం సాధించింది. హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసారు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

బెస్ట్ సపోర్టింగ్ రోల్ గా శేఖర్ కమ్మల చిత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో నటించినందుకు గానూ అక్కినేని అమల అందుకున్నారు. అందులో ఆమె పిల్లల తల్లిగా...కాన్సర్ పేషెంట్ గా నటించి రక్తి కట్టించారు. కథకి ఆమె పాత్ర చాలా తోర్పడింది. సెంటిమెంట్ తో ఆమె సినిమాని ఓ స్ధాయికి తీసుకెళ్ళింది.

ఎటో వెళ్లిపోయింది మనస్సు

ఎటో వెళ్లిపోయింది మనస్సు

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఎటో వెళ్లిపోయింది మనస్సులో బెస్ట్ లిరిక్ రైటర్ గా అనంత్ శ్రీరామ్ ఈ అవార్డుని అందుకున్నారు. సమంత,నాని కాంబినేషన్ లో వచ్చిన మరో చిత్రం ఇది. ఈ చిత్రం కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా...మంచి ఫిల్ గుడ్ చిత్రంగా విమర్శకుల ప్రశంసంలు అందుకుంది.

బిజినెస్ మ్యాన్

బిజినెస్ మ్యాన్

మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన బిజినెస్ మ్యాన్ ఏ రేంజి విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలో పాడిన ఫిమేల్ సింగర్ సుచిత్రం కు అవార్డు వరించింది. మహేష్ లో గ్లామర్ కి, తనదైన వాడి వేడి డైలాగులు కలిపి తయారు చేసిన బిజినెస్ మ్యాన్ అందరికీ లాభాలు తెచ్చి పెట్టింది.

ఢమురకం

ఢమురకం

నాగార్జున,శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన గ్రాఫిక్ చిత్రం ఢమురకం. ఈ చిత్రంకి ఉత్తమ ఛాయాగ్రాహకుడు అవార్డుకి ఛోటా కె నాయుడు కి వచ్చింది. సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకర్షించింది. నాగార్జున చేసిన తొలి సోషియా ఫాంటసీ చిత్రంగా నిలిచిపోయింది.

రచ్చ

రచ్చ


రామ్ చరణ్, సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చి విజయవంతమైన చిత్రం రచ్చ. ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను బాగా ఉర్రూతలూగించింది. అందుకు కారణం చిత్రంలో పాటలు కూడా. ఈ చిత్రంలో పాటలకు కొరియోగ్రఫి చేసిన జానికి బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు వచ్చింది. ఈ చిత్రం కరర్షియల్ గానూ మంచి విజయం సాధించింది.

బాపు

బాపు

ప్రముఖ దర్శకుడు బాపు గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రకటించారు. ఇక ఈ వేడుకలో శృతి హాసన్, తదితర తారలు తమ డాన్సులతో అలరించారు. ఎఆర్ రెహమాన్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా, ధనుష్, అనిరుధ్ రవిచందర్, శృతి హాసన్, తమన్నా, యామి గౌతం, అల్లు శిరీష్, అమలా పాల్, ప్రియమణి, లక్ష్మీమంచు, నిఖీషాపటేల్,కృతి కర్భంద, చార్మీ తదితరులు ఈ వేడుకకి హాజరయ్యారు.

English summary
The 60th Filmfare Awards (South) have been announced. Pawan Kalyan has gets the Best Actor award for his stunning performance in Gabbar Singh while Rajamouli has bagged the Best Director (Eega). Samantha was awarded the best Actress (Eega) and Eega was honoured with the Best Film
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu